Gangster Chhota Rajan: 1999లో దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కు చెందిన వ్యక్తి హత్యకు సంబంధించిన కేసులో ముంబైలోని సెషన్స్ కోర్టు గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్‌ను విడుదల చేసింది. డిసెంబర్ 17న ఛోటా రాజన్ డిశ్చార్జ్ పిటిషన్‌ను కోర్టు అనుమతించింది. మంగళవారం వివరణాత్మక ఉత్తర్వులు అందుబాటులోకి వచ్చాయి.ప్రాసిక్యూషన్ ప్రకారం.. సెప్టెంబర్ 2, 1999న సబర్బన్ అంధేరీలో దావూద్ ముఠా సభ్యుడు అనిల్ శర్మను ఛోటా రాజన్ వ్యక్తులు కాల్చిచంపారు.
సెప్టెంబరు 12, 1992న ఇక్కడి జేజే హాస్పిటల్‌లో కాల్పులు జరిపిన బృందంలో అనిల్ శర్మ కూడా ఉన్నారని ఆరోపించారు. ప్రత్యర్థి ముఠా సభ్యుడిని హతమార్చేందుకు దావూద్ గ్యాంగ్ కాల్పులు జరిపిందని ఆరోపించారు. దావూద్, రాజన్ గ్యాంగ్‌ల మధ్య పోటీ కారణంగా అనిల్ శర్మ హత్యకు గురయ్యాడని ప్రాసిక్యూషన్ పేర్కొంది. ప్రాసిక్యూషన్ ఛోటా రాజన్‌కు వ్యతిరేకంగా నేరారోపణకు సంబంధించి ఎటువంటి సాక్ష్యాలను తీసుకురాలేదని న్యాయమూర్తి తమ ఉత్తర్వులో వెల్లడించారు. ఛార్జిషీట్‌ను పరిశీలించిన తర్వాత, అనిల్ శర్మ హత్యకు ఇతర నిందితులతో కలిసి ఈ దరఖాస్తుదారు కుట్ర పన్నినట్లు రుజువు చేయడానికి ప్రాథమిక సాక్ష్యం అందుబాటులో లేదని కోర్టు జోడించింది.
Pakistan: పోలీస్ స్టేషన్‌ను స్వాధీనం చేసుకున్న ఉగ్రవాగ ఖైదీలు హతం.. బందీలు విడుదల
అభియోగాలు మోపడానికి తగిన మెటీరియల్ లేనందున, ఛోటా రాజన్ విడుదలకు అర్హులని కోర్టు పేర్కొంది. 2015లో ఇండోనేషియాలోని బాలి నుంచి బహిష్కరణకు గురైనప్పటి నుంచి ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న చోటా రాజన్ అనేక ఇతర కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్నాడు. జర్నలిస్టు జే డే హత్య కేసులో అతడికి శిక్ష పడింది.