ఉద్యోగాలు చేసే చోట మహిళల ఎదుర్కొనే ఇబ్బందులు ముఖ్యంగా లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించేలా పలు చట్టాలు, నిబంధనలు తీసుకొచ్చారు. అయినా సరే ఏదో ఒక సాకుతో కొందరు మహిళలను వేధింపులకు గురిచేస్తుంటారు. చూపులతోనూ, మాటలతోనూ ఇబ్బంది పెడుతుంటారు. ఇలాగే తన సహోద్యోగుల కారణంగా ఇబ్బంది పడిన ఓ మహిళ.. విసిగిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది.. ఈ ఘటన పై కోర్టు విచారణ జరిపిన అనంతరం కీలక తీర్పు ను ఇచ్చింది..
మీ సంస్థలో పనిచేసే మహిళా సహోద్యోగిని ఉద్దేశించి ఫిగర్ బాగుందని, మేడం మీరు సూపర్ గా ఉన్నారు అని చెప్పడం కూడా వేధింపులగానే పరిగణించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. బాగా మెయింటెయిన్ చేస్తున్నారనడం, డేటింగ్‌కు రమ్మనడం కూడా అశ్లీల పదజాలం కిందకే వస్తాయని కోర్టు స్పష్టం చేసింది. ఇటువంటి మాటలు ఆమె గౌరవానికి భంగం కలిగిస్తాయని.. ఈ వ్యాఖ్యలు చేసిన వారు ముందస్తు బెయిల్‌కు అర్హులు కారని తేల్చిచెప్పింది. నిందితులను కస్టడీలోనే విచారించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు సెషన్స్ కోర్టు జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు..
ఓ ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్న మహిళను మేనేజర్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. ఫిగర్ బాగుందని, డేట్‌కు వస్తావా? అంటూ కామెంట్లు చేయడంతో ఆమె పోలీసులను ఆశ్రాయించారు.. ఈ కేసు పై పలు విచారణలు జరిపిన అనంతరం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.. సో అదన్నమాట.. ఎక్కడైనా, ఎప్పుడైనా పొరపాటున కూడా ఇలా నోరు జారకండి.. జైలు ఊసలు లెక్క బెట్టాల్సిందే.. బీ కేర్ ఫుల్..