ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి ముంపు పొంచి ఉందా.. యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత కూడా రామప్ప అభివృద్ధికి సరైన చర్యలు తీసుకోవడం లేదా అంటే అవుననే అంటున్నారు స్థానికులు. చిన్నపాటి వర్షానికి రామప్ప దేవాలయం పైకప్పు నుంచి నీరు కురవడమే ఎందుకు నిదర్శనం అంటున్నారు.
Mulugu Doctors: ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు జ్వరం వచ్చినా, అనారోగ్యం వచ్చినా మందులే దిక్కు. దట్టమైన అడవుల్లో రవాణా సౌకర్యాలు లేవు.. వైద్యం అందించేందుకు వైద్యులు ముందుకు రావడం లేదు.
ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏటూరునాగారం హైవే ట్రీట్ సమీపంలో 163 జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఆటోని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతన్ని 108లో ఆసుపత్రికి తరలించారు. కాగా.. మృతులు వాజేడు మండలానికి చెందిన వారిగా గుర్తించారు. మృతి చెందిన వారిలో.. కాకర్లపూడి సత్యనారాయణ రాజు, భార్య సత్యవతి ఉన్నారు. అయితే.. తమ కూతురు అనితను వైజాగ్ వెళ్లేందుకు…
విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఆ స్కూల్‌లో మాత్రం తరగతులు ప్రారంభం కాలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లాలోని మంగపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన కస్తూరిబా బాలికల ఆశ్రమ పాఠశాల ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు.
ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాము కాటేయడంతో రాణి (16)అనే బాలిక మృతి చెందింది. వేసవి కాలం సెలవుల కోసమని తన బంధువులైనా పెద్దమ్మ ఇంటికి కత్తిగూడెం వెళ్లింది. అయితే సరదాగా గడుపుదామనుకున్న బాలిక శవమై వచ్చింది. పెద్దమ్మ ఇంటి వద్ద గడ్డివాము దగ్గర ఆరుబయట మంచం మీద కూర్చుంది. తనకు తెలియకుండానే విష పురుగు రాణిని కాటేసింది. మొదట ఎలుకగా భావించిన కుటుంబ సభ్యులు.. బాలిక పరిస్థితి విషమించింది. దీంతో.. బాలికను వెంటనే…
మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ములుగు జిల్లాలో పోలింగ్ కు సర్వం సిద్దంమైందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిని ఇలా త్రిపాఠి తెలిపారు. ఇక, ములుగు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనున్నట్లు చెప్పారు.
ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎండలు తాళలేక తండ్రి, కూతురు గోదావరి స్నానానికి వెళ్లారు. స్నానం చేస్తుండగా తండ్రి నదిలో మునిగిపో సాగాడు. దీంతో భయాందోళన చెందిన కుమార్తె నిఖిత (14) సాయం చేసేందుకు.. తన తండ్రికి చెయ్యి అందించబోయింది.
పంచాయితీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తన సొంత ఇలాకాలో పర్యటించనున్నారు మంత్రి సీతక్క. రేపు (ఆదివారం) ఉదయం హైదరాబాద్ క్వార్టర్స్ నుండి రోడ్డు మార్గాన బయలుదేరుతారు. ఉదయం 9:15 గంటలకు ములుగు మండలంలోని మహమ్మద్ గౌస్ పల్లికి చేరుకుంటారు. అనంతరం.. ఉదయం 10:15కు ములుగు గట్టమ్మ దేవాలయంలో మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.