TG Governor: సంక్షేమ పథకాలు అందరికీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి..
- కేంద్ర
- రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో..
- చివరి వ్యక్తికి అందేలాగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలి- గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
- గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అట్టడుగు వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందాలి- గవర్నర్
- ములుగు జిల్లా పర్యటనలో అధికారులకు సూచించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో చివరి వ్యక్తికి అందేలాగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అధికారులకు సూచించారు. పెద్ద పెద్ద నగరాల్లో ఉన్న వారికే కాకుండా.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అట్టడుగు వర్గాల వారికి కూడా సంక్షేమ పథకాలు అందేలాగా చూడాలని గవర్నర్ సూచించారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ములుగు జిల్లాలో అధికార యంత్రాంగం చేపట్టిన అభివృద్ధి పనులు క్రింది స్థాయి వారికి చేరేలాగా తీసుకున్న చర్యలని గవర్నర్ అభినందించారు.
Kolkata Doctor Murder: సచివాలయం ముట్టడికి జూనియర్ వైద్యులు మద్దతు ఎందుకు ఇవ్వలేదు?
Also Read
మంత్రి సీతక్క చొరవ.. మాతా శిశు మరణాలను తగ్గించిన విధానాన్ని జిల్లా అధికారులు గవర్నర్కి తెలిపారు. సంక్షేమ శాఖ నుంచి పేదలకు అందిస్తున్నటువంటి పథకాలను వివరాలని గవర్నర్కి జిల్లా కలెక్టర్ వివరించారు. 80 గ్రామాల్లో ముంపు కారణంతో నష్టం జరిగిన వారికి ముందస్తుగా చేపట్టిన చర్యలు ఎలాంటి ఫలితాలు వచ్చాయో జిల్లా అధికారులు గవర్నర్కి వివరించడంతో జిల్లా యంత్రాంగాన్ని అభినందించడంతో పాటు మంత్రిని అభినందించారు. గవర్నర్ గతంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మంత్రిగా పనిచేసిన తనకి ములుగు జిల్లాలో చరిత్ర ఆకట్టుకుంది అన్నారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో మంత్రిత్వ శాఖలో పనిచేసిన తనకి మంత్రి చేపట్టిన చర్యలు సంతోషం ఇస్తున్నాయని సూచించారు.
Advocate Mohit Rao: ఈడీ కేసుపై కవిత న్యాయవాది కీలక వ్యాఖ్యలు..
అనంతరం.. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రామప్ప ఆలయాన్ని సందర్శించారు. రామప్ప దేవాలయం చాలా సుందరమైన దేవాలయం.. ఇలాంటి దేవాలయం దేశంలో మరో చోట లేదని అన్నారు. రామప్ప దేవాలయాన్ని చూడడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. యునెస్కో గుర్తింపు ఎప్పుడో రావాల్సినటువంటి గుడి అని కొనియాడారు. రామప్ప టెంపుల్ చాలా బాగుందని.. మరోసారి కుటుంబ సమేతంగా రామప్ప దేవాలయానికి రావాలనుకుంటున్నట్లు గవర్నర్ చెప్పారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!