Ponguleti Srinivas Reddy : సమగ్ర కుటుంబ సర్వే శాస్త్రీయంగా జరుగుతుందని, హడావుడి లేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మనిషి ఎక్స్ రే మాదిరిగా సర్వే జరుగుతుందన్నారు. కోటి 16 లక్షల 14 వేల 349 కుటుంబాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నట్లు, 9వ తేదీ నుంచి సర్వే జరిగుతోందని, ఇప్పటివరకు 58.3% అంటే 67 లక్షల 76 వేల 203 కుటుంబాల సర్వే జరిగిందన్నారు మంత్రి పొంగులేటి. ఏ కుటుంబానికి…
మంత్రి సీతక్క ఆదేశాలతో వరంగల్ జిల్లా జంగాలపల్లి గ్రామంలో మెడికల్ క్యాంప్ చేశారు అధికారులు. RWS నీటి పరీక్షలు ఏర్పాటు చేశారు జిల్లా అధికారులు. ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాల వల్ల సుమారుగా 17 మంది చనిపోవడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే 2024) విజయవంతంగా సాగుతోంది. అన్ని వర్గాల సంక్షేమం, సామాజిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే దేశమందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నవంబర్ 6న ప్రారంభమైన ఈ సర్వే.. 12 రోజుల్లోనే సగానికిపైగా పూర్తయింది. ఆదివారం (నవంబర్ 17) నాటికి 58.3% సర్వే పూర్తయింది.
ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలంలో ఐలాపూర్ షడ్యూల్డ్ తెగ గ్రామ పంచాయితీకి చెందిన పలువురు ప్రజలు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ, కుల సర్వేను బహిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మల్లెల లక్ష్మయ్య మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా.. తమ గ్రామానికి ఇంత వరకు తారు రోడ్డు నిర్మించక పోవడం దారుణమన్నారు.
Minister Seethakka: నేడు మంత్రి సీతక్క ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో ములుగు గడిగడ్డ ఎస్సీ, ఎస్టీ బాలికల హాస్టల్ ను పరిశీలించారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు ఏటూరునాగారంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు.
ములుగు జిల్లాలోని ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యం, తాడ్వాయి అటవీ ప్రాంతంలో జరిగిన పర్యావరణ విపత్తుపై వర్క్‌షాప్ నిర్వహించారు. విపత్తు జరిగిన రోజు అక్కడ విపరీతమైన గాలులు, భారీ వర్షం ఒకే చోట కురవడం వలన కేవలం ఆ ప్రాంతంలోనే ఎక్కువ నష్టం జరిగింది. NRSC, NARLకి చెందిన శాస్త్రవేత్తలు బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో రెండు ప్రాంతాల్లో ఒకేసారి వాయుగుండం సంభవించడం వలన ఇక్కడ గంటకు 130-140 కిలోమీటర్లు వేగంతో గాలి వీచిందని చెబుతున్నారు.
Mulugu: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని బెస్తగూడెం గ్రామ సమీపంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. గ్రామంలోకి వెళ్లే మూల మలుపు వద్ద ఓ చెట్టుకి చీర కట్టి అక్కడ గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి క్షుద్ర పూజలు చేసినట్టుగా తెలుస్తోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను కూడా క్షేత్రస్థాయిలో చివరి వ్యక్తికి అందేలాగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అధికారులకు సూచించారు. పెద్ద పెద్ద నగరాల్లో ఉన్న వారికే కాకుండా.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అట్టడుగు వర్గాల వారికి కూడా సంక్షేమ పథకాలు అందేలాగా చూడాలని గవర్నర్ సూచించారు.