Muthyam Dhara: ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరం గ్రామ సమీపంలోని ముత్యాంధర జలపాతాలను చూసేందుకు వెళ్లిన 160 మంది పర్యాటకులు ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నారు.. 8 గంటలపాటు నీటిలో ఉంటూ కుండపోత వర్షంలో గడిపారు.
పాలంపేటలో ఉండే యూనేస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని కేటీఆర్ సందర్శించారు. అనంతరం రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన.. ఆలయ విశిష్టత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నాడు. అంతేకాకుండా అక్కడి నుంచి రామప్ప చెరువుకు వెళ్లి బోటింగ్ చేశారు. అనంతరం చెరువులోకి వచ్చే గోదావరి జలాలకు మంత్రి కేటీఆర్ పూజలు చేశారు. అంతేకాకుండా స్థానిక మత్స్యకారులతో కాసేపు ముచ్చటించారు.
Minister KTR: నేడు ములుగు జిల్లాలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పర్యటించనున్నారు. 150 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కేటీఆర్ చేయనున్నారు.
మహా శివరాత్రినాడు విషాదం నెలకొంది. పర్వదినం సందర్భంగా గోదావరి స్నానానికి వెళ్ళి ఓ యువకుడు గల్లంతయ్యాడు. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం బిల్ట్ ఇంటెక్వెల్ సమీపంలోఈ సంఘటన జరిగింది. గల్లంతయిన యువకుడిని భూక్యా సాయి(20 )గా బంధువులు గుర్తించారు. అతని మృతదేహం లభించడంలో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కమలాపురం టీడీపీ కాలనీకి చెందిన భూక్య సాయి తమ బంధువులు, చట్టుప్రక్కల ఇళ్ళవారితో కలిసి మంగళవారం ఉదయం గోదావరి స్నానం చేయడం కోసం వెళ్ళారు. గోదావరిలో…
సమ్మక్క-సారక్క జాతర ముగియగానే ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గురువారం తెలిపారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. “నీతి ఆయోగ్ యొక్క 2019-20 ఆరోగ్య సూచీలో పెద్ద రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం మూడవ స్థానాన్ని పొందగా, బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ దిగువన ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోందని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రకటించింది. రాష్ట్ర…