కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నివాసానికి జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ మరోసారి వెళ్లారు. ముద్రగడ, బొలిశెట్టి ఇద్దరే అరగంటకు పైగా మాట్లాడుకున్నారు. ముద్రగడను బొల్లిశెట్టి కలవడం ఇది రెండోసారి.
కాపు ఉద్యమ నేత ఏ పార్టీలో చేరతారనే విషయంపై కొంచెం స్పష్టత వచ్చినట్లుగా అనిపిస్తోంది. వైసీపీలోకి వచ్చే ప్రసక్తే లేదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను కలవడానికి ముద్రగడ పద్మనాభం ఇష్టపడలేదని తెలుస్తోంది. తోట త్రిమూర్తులను రావొద్దని, వచ్చినా కలవనని పద్మనాభం చెప్పినట్లు సమాచారం.
ఏపీలో రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ తరుణంలో కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న ముద్రగడ పద్మనాభం వైపు పార్టీలు చూస్తున్నాయి. ఏపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఆయా పార్టీల గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం త్వరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నారా? ఆయన ఇంటికి వెళ్లి జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించనున్నారా? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచుతున్న తాజా పరిణామం ఇది.
ముద్రగడతో టచ్‌లోకి వెళ్లారు జనసేన పార్టీ నేతలు.. కిర్లంపూడిలోని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ నివాసంలో జనసేన పార్టీ నాయకులు ఆయన్ని కలిశారు. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంఛార్జ్ బొల్లిశెట్టి శ్రీనివాస్‌తో సహా పలువురు నేతలు ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని సాదరంగా ఆహ్వానించిన ముద్రగడ.. జనసేన నేతలతో ఏకాంత చర్యలు జరిపినట్టు తెలుస్తోంది.