Mudragada Padmanabham: సీఎం జగన్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి లేఖ రాశారు. ఈ సందర్భంగా కొన్ని అంశాలను ఆయన లేఖలో ప్రస్తావించారు. బలిజ, తెలగ, ఒంటరి, కాపు కులాలకు రిజర్వేషన్లు పోరాటానికి ముగింపు పలికే దిశగా అడుగులు ఉండాలని సూచించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని పార్టీల వారు వారిని ఉపయోగించుకున్నారని.. అందరిలా జగన్ ఉండకూడదని ముద్రగడ పద్మనాభం ఆకాంక్షించారు. అసెంబ్లీలో వీరి కోరిక సమంజసం, న్యాయం అని మీరు అన్నారని విన్నానని..…
గతంలో ఎమ్మెల్యేగా.. మంత్రిగా.. ఎంపీగా పనిచేసిన అనుభవం ముద్రగడ పద్మనాభానికి ఉంది. సమయానుకూలంగా పార్టీలు మారుతూ కొన్నిసార్లు సక్సెస్ అయ్యారు.. మరికొన్నిసార్లు ఫెయిల్ అయ్యారు. 1994లో తొలిసారి ప్రత్తిపాడులో ఓడిన తర్వాత.. ఇక జీవితంలో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాబోనని భీష్మించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ సీట్ ఆఫర్ చేయడంతో పిఠాపురంలో పోటీ చేసినా.. ఆ సీటును ప్రజారాజ్యం పార్టీ గెల్చుకుంది. ఆపై ప్రత్యక్ష రాజకీయాలకు దూరం జరిగి.. కాపు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. తర్వాత…
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు మొదలైంది.. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశారు.. 13 జిల్లాలుగా ఉన్న ఏపీ 26 జిల్లాలుగా పునర్విభజించనున్నారు.. ఆయా జిల్లాల పేర్లను కూడా ఖరారు చేశారు.. మరోవైపు.. ఇప్పటికే అనేక సమస్యలపై వరుసగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి లేఖలు రాస్తూ వస్తున్న మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మానాభం.. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలోనూ ఓ లేఖ రాశారు.. కొత్త జిల్లాలకు తాను సూచిస్తున్న మూడు పేర్లు పెట్టాలని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి మరో లేఖ రాశారు కాపు ఉధ్యమ నేత ముద్రగడ పద్మనాభం.. ఇప్పటికే పలు అంశాలు, సమస్యల పరిష్కారం కోసం సీఎంకు లేఖలు రాస్తూ వస్తున్న ఆయన.. ఈ సారి ఓటీఎస్ విధానాన్ని తన లేఖలో పేర్కొన్నారు.. ఓటీఎస్ పేరుతో పేద ప్రజలపై ఒత్తిడి తేవద్దని, గత ప్రభుత్వ హాయంలో చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు వెంటనే చెల్లించాలని తన లేఖలో సీఎంను కోరారు ముద్రగడ.. ఇక, గత ప్రభుత్వం…
రాజ్యాధికారం దిశగా కాపు సామాజికవర్గం యాక్టివ్ కావడం టీడీపీలో గుబులు రేపుతోందా? వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే కాపుల ఓట్లే కీలకమని లెక్కలేసుకుంటున్న తరుణంలో.. కొత్త పరిణామాలు టీడీపీని కలవర పెడుతున్నాయా? విపక్ష పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? బీసీల తిరిగి దగ్గరయ్యారనే అంచనాల్లో టీడీపీఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటింది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని.. క్షేత్రస్థాయిలో తమ పార్టీకి అనుకూల వాతావరణం ఉందని లెక్కలేస్తోంది టీడీపీ. గత ఎన్నికల్లో టీడీపీ ఓటమికి బీసీ,…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కొత్త పార్టీ పెడుతున్నారని ఇటీవల తీవ్రస్థాయిఓ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎస్సీ, బీసీ, కాపు కులాలకు ముద్రగడ రాసిన లేఖ కొత్త పార్టీ ఏర్పాటుపై సంకేతాలు పంపింది. ఏపీలో తక్కువ జనాభా కలిగిన వర్గాల వారు అధికారం అనుభవిస్తున్నారని… ఎక్కువ జనాభా కలిగిన మన జాతులు ఎందుకు అనుభవించకూడదో ఆలోచన చేయాలని లేఖలో ముద్రగడ ప్రస్తావించారు. ఎప్పుడూ పల్లకి మోయడం కాదని.. మనం పల్లకిలో కూర్చునేలా…