కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తన వైసీపీ చేరికపై స్పష్టత ఇచ్చారు. ఆయనే స్వయంగా స్పందించారు. ఈనెల 14న వైసీపీలో చేరుతున్నానని ముద్రగడ పద్మనాభం చెప్పారు. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నానని వెల్లడించారు.
ఎన్నికల వేళ ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడంపై స్పష్టత రాకున్నా వైసీపీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
ఈ నెల 12వ తేదీన ముద్రగడ.. వైసీపీలో చేరతారని తెలుస్తోంది. ముద్రగడ నివాసానికి వెళ్లిన వైసీపీ నేత జక్కంపూడి గణేష్.. ముద్రగడను ఎంపీ, వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ మిథున్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడించారు.
ముద్రగడ పద్మనాభం కుటుంబం రాజకీయ భవితవ్యంపై తర్జన భర్జన జరుగుతోంది. ముద్రగడ కుమారుడు గిరికి వైసీపీ పెద్దలు టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. రాజకీయ అంశాలపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి వచ్చిన ప్రపోజల్‌పై ముద్రగడ కుమారుడు గిరి తన తండ్రితో చర్చించారని తెలిసింది.
Mudragada Padmanabham Writes Letter to Janasena Chief Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరో లేఖ రాశారు. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా 80 అసెంబ్లీ సీట్లు, రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి అడిగి ఉండాల్సిందని.. ఆ సాహసం మీరు చేయకపోవడం బాధాకరం అని పేర్కొన్నారు. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఆయన పరపతి పెరగడానికి మీరే కారకులు అని, ప్రజలు మిమ్మల్ని…