జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ముద్రగడ పద్మనాభం ఫైర్ అయ్యారు. హైదరాబాద్, విజయవాడలో ఉన్న ఆస్తులు అమ్మేసి పిఠాపురం వచ్చేయమనండి.. అప్పుడు గౌరవం ఇస్తామని ఆయన అన్నారు.
బొచ్చు గాళ్ళు వాళ్ళే వారసత్వం చేయాలా? మూడు తరాలుగా రాజకీయాలో ఉన్నాం.. నా కొడుకు ఎందుకు రాకూడదు? అని ప్రశ్నించారు. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే లేకుండా ఎవడు పడితే వాడు పార్టీ పెడితే నేను వెళ్ళాలా? అని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు.
ఈ మధ్య వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కూడా పిఠాపురం పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.. యూ కొత్తపల్లి మండలానికి చెందిన కాపు నేతలతో సమావేశం నిర్వహించారు.. కిర్లంపూడిలో తన నివాసంలో ఈ మీటింగ్ జరిగింది.. ఎన్నికల ప్రచార శైలి ఏ విధంగా ఉండాలి.. సభలు, సమావేశాలు ఎలా నిర్వహించాలి.. వాటిపై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం.. ఈ రోజు విపక్షాలపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.. పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్ధమని ప్రకటించిన ఆయన.. జనసేన వేరే పార్టీలో కలవడం కాదు త్వరలోనే క్లోజ్ అయిపోతుందని జోస్యం చెప్పారు.. పిఠాపురంలో వైసీపీకి సునాయాసంగా ఉంటుందన్న ఆయన.. సినిమావాళ్లు అతీతులు కాదు.. మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు.. మా ఇంటికొస్తే ఏం తెస్తారు అనే విధంగా సినిమా…
ముద్రగడ పద్మనాభం వైసీపీ లో చేరిక వాయిదా పడింది. గతంలో రేపు వైసీపీలో చేరతానని ఆయన ప్రకటించారు. అయితే, సెక్యూరిటీ కారణాలతో కిర్లంపూడి నుంచి తాడేపల్లి ర్యాలీని రద్దు చేసుకున్నారు. ఇక, ఈ నెల 15 లేదా 16 ముద్రగడ ఫ్యామిలీ మాత్రమే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్లు తెలిపారు.
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఈనెల 14వ తారీఖున వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపలో చేరబోతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలో చేరికపై తన అభిమానులకు తాజాగా ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు.