MS Dhoni May Get BANNED For IPL 2023 Final Due to Slow Over Rate: ఐపీఎల్-2023 సీజన్‌లో భాగంగా తొలి క్వాలిఫైయర్‌లో గుజరాత్ టైటాన్స్‌ని ఓడించి.. చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్స్‌కు చేరిన విషయం తెలిసిందే. ‘క్వాలిఫైయర్ 2’లో ఎవరైతే విజయం సాధిస్తారో, ఆ జట్టుతో సీఎస్కే మే 28వ తేదీన తలపడనుంది. అయితే.. ఈలోపే సీఎస్కే జట్టుకి ఒక భారీ షాక్ తగిలే ఛాన్స్ ఉంది. సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ఒక మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉన్నట్లు క్రికెట్ వర్గాలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు కారణం.. జీటీతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ అంపైర్లతో వాగ్వాదానికి దిగడమే. వారితో ధోనీ వాగ్వాదానికి దిగి, 4 నిమిషాల సమయాన్ని వృథా చేశాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న మ్యాచ్ రిఫరీ.. ధోనిపై భారీ జరిమానా విధించడమో లేదా ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉందని ఓ ప్రముఖ క్రీడా వెబ్‌సైట్ వెల్లడించింది. అదేవిధంగా.. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా దీనిపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. జరిమానా విధిస్తే ఏం కాదు కానీ.. నిషేధం విధిస్తే మాత్రం, ఫైనల్స్‌లో సీఎస్‌కే గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు అవుతుంది.
YS Vimala Reddy: అవినాష్ రెడ్డిని టార్గెట్ చేశారు.. సునీత వెనుక దుష్టశక్తులున్నాయి
అసలేం జరిగిందంటే.. సీఎస్కే బౌలర్ మతీషా పాతిరానా 16వ ఓవర్ వేసేందుకు సిద్ధమవుతుండగా, ఫీల్డ్ అంపైర్‌లు అందుకు అంగీకరించలేదు. అందుకు కారణం.. అతడు ఈ ఓవర్ వేసే ముందు 9 నిమిషాల పాటు మైదానంలోనే లేడు. నేరుగా డగౌట్ నుంచి బౌలింగ్ వేయడానికి వచ్చాడు. రూల్స్ ప్రకారం.. మైదానంలో లేకుండా, అలా నేరుగా వచ్చి బౌలింగ్ వేయడానికి వీలు లేదు. అందుకే, ఫీల్డ్ అంపైర్లు అతడ్ని అడ్డుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే ధోనీ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. ఫైనల్‌గా అతడు అంపైర్లను ఒప్పించగలిగాడు కానీ, వారితో వాగ్వాదానికి దిగడంతో పాటు 4 నిమిషాల సమయాన్ని వృధా చేయడమే ధోనీకి శాపంగా మారే అవకాశంగా ఉంది. మరి, అతనిపై ఫైన్ విధిస్తారో? లేక నిషేధం విధిస్తారో? చూడాలి. అయితే.. తుది నిర్ణయం మాత్రం మ్యాచ్ రిఫరీపైనే ఆదారపడి ఉంటుంది.
Child Marriage: దారుణం.. డబ్బుల కోసం ఏడేళ్ల బాలికతో 38 ఏళ్ల వ్యక్తి పెళ్లి