Bandi Sanjay: రజాకార్ సినిమాకు వినోదపు పన్ను నుండి మినహాయింపు ఇవ్వాలని, పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఈ సినిమా చూపించాలని కోరుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి ఎంపీ బండి సంజయ్ కుమార్ లేక రాశారు. రజాకార్ల రాక్షస పాలనలో తెలంగాణ ప్రజలు పడ్డ బాధలను కళ్లకు కట్టినట్లు చూపిన సినిమా రజాకార్ అన్నారు. నిజాం పాలన నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించి స్వేచ్ఛా వాయువుల అందించేందుకు జరిగిన పోరాటాలను, రజాకార్ల రాక్షసత్వంపై పోరాడి సమిధలైన యోధుల చరిత్రను, తెలంగాణ ప్రజలకు విమోచన కల్పించేందుకు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ చేసిన కృషిని అద్బుతంగా తెరపై చూపించిన సినిమా ఇది అని తెలిపారు. నాటి వాస్తవాలను నేటి తరానికి తెలియజేయాలనే మంచి ఉద్దేశంతో ఎన్ని ఇబ్బందులు ఎదురయనేది ఈ సినిమాలో చూపించారని అన్నారు. అంతేకాదు.. ఎన్ని అవరోధాలు కల్పించినా వాటిని అధిగమించి సినిమాను అత్యద్బుతంగా తీసిన దర్శక, నిర్మాతలతోపాటు సినిమా యూనిట్‌ను అభినందించడంతోపాటు ప్రభుత్వపరంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
Read also: Hariah Rao: రైతులకు రూ.10వేలు ఇవ్వండి.. ప్రభుత్వానికి హరీష్ రావు డిమాండ్
తద్వారా ప్రజల్లోకి మంచి సందేశం పంపినట్లవుతుందన్నారు. ముఖ్యంగా ఎన్నో ఆటుపోట్లను, ఆర్దిక ఇబ్బందులను ఎదుర్కొని నిర్మించిన రజాకార్ సినిమాకు వినోదపు పన్ను నుండి మినహాయింపు ఇవ్వాలని మిమ్మల్ని సవినయంగా కోరుతున్నానని తెలిపారు. అంతేకాకుండా.. థియేటర్లలో ప్రత్యేక షో వేసి ఈ సినిమాను పాఠశాల, కళాశాల విద్యార్థులకు చూపించాలని కోరారు. తద్వారా నాటి మహనీయులను స్మరించుకోవడంతోపాటు వారి పోరాటాలు నేటి తరానికి స్పూర్తిగా నిలిచే అవకాశముందని తెలిపార. ఇంతటి చారిత్రాత్మక నేపథ్యమున్న రజాకార్ సినిమాను థియేటర్లలో ప్రదర్శించే అవకాశం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తున్న విషయం మా దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఇలాంటి సందేశాత్మక సినిమాలను వీలైనంత ఎక్కువ థియేటర్లలో ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు.
Top Headlines @ 1 PM : టాప్ న్యూస్