యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయం రామలింగేశ్వర స్వామివారి మహాకుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా జరుగుతున్న ప్రధానాలయ పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్ దంపతులు. ఎర్రవల్లి నుంచి రోడ్డుమార్గంలో ఆలయానికి చేరుకున్నారు సీఎం కేసీఆర్ దంపతులు. ముందుగా స్వయంభూ పంచనారసింహుడిని దర్శించుకున్నారు. అనంతరం రామలింగేశ్వరస్వామివారి సన్నిధిలో జరిగే మహాకుంభాబిషేక మహోత్సవంలో పాల్గొని నూతనాలయాన్ని పునఃప్రారంభించారు.తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామివారి చేతుల మీదుగా జరుగుతున్న ఉద్ఘాటన పర్వాలులో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహ…
“మనం బ్రతుకుదాం – పది తరాలకు బతికే అవకాశం కల్పిద్దాం” అన్నారు రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రథసారథి జోగినిపల్లి సంతోష్ కుమార్. ప్రపంచ ధరిత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటిన ఆయన “ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టాలు పెరగడం, ప్రమాదకరస్థాయికి ప్లాస్టిక్ వినియోగం పెరగడం, నేలంతా విషతూల్యం కావడం, భూవాతావరణం గతంలో ఎప్పుడూలేనంతగా వేడెక్కడం” పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విపరిణామాల వల్ల మిలియన్ల ప్రజల బ్రతుకులు విచ్ఛిన్నమవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ…
సిరిసిల్ల జిల్లా సుద్దాల కి చెందిన ప్రకృతి ప్రేమికుడు ప్రకాష్ కుమార్తె బ్లెస్సీ. తన పుట్టిన రోజు నాడు పర్యావరణ హిత కార్యక్రమం చేయాలని తలచింది. పచ్చదనాన్ని ప్రేమించే తండ్రినే స్ఫూర్తిగా తీసుకుని 65 వేల సీడ్ బాల్స్ స్వయంగా తయారుచేసింది. తాను తయారు చేసిన సీడ్ బాల్స్ కొన్ని సిరిసిల్ల అటవీ ప్రాంతంలో వెదజల్లింది. పర్యావరణంపై ప్రేమతో భావి తరాలకు స్ఫూర్తివంతంగా నిలుస్తున్న బ్లెస్సీని మంత్రి కేటీయార్, ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా అభినందించారు.…
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌కు టీఆర్ఎస్ ఎంపీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ థ్యాంక్స్ చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోని దండుమైలారం ఇండస్ట్రియల్ పార్కులో అజయ్ దేవగణ్ 6 నెలల క్రితం మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం అజయ్ దేవగణ్ ఎన్‌వై ఫౌండేషన్‌ను స్థాపించిన విషయం తెలిసిందే. తన ఫౌండేషన్ కార్యక్రమాల్లో సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను భాగస్వామ్యం చేస్తూ అజయ్ దేవగణ్ మొక్కలు నాటారు. అయితే ఇప్పుడు ఆ…