MP Santosh Kumar : కొండగట్టు పునర్‌నిర్మాణంలో మరో కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీరాముడికి నమ్మిన బంటు ఆంజనేయస్వామి, అలాంటి ఆంజనేయుడు స్వయంభుగా వెలసిన ప్రాంతం జగిత్యాల జిల్లా కొండగట్టు. సహజమైన కొండలు, గుట్టల మధ్య వెలసిన కొండగట్టును దేశంలోనే ప్రముఖ ఆంజనేయ స్వామి దేవాలయంగా పునర్ నిర్మించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు నమ్మినబంటైన ఎంపీ సంతోష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
సీఎం నిర్ణయానికి మద్దతుగా, కోట్లాది మంది ఆంజనేయ భక్తులకు బాసటగా కొండగట్టు ఆలయాన్ని ఆనుకుని ఉండే వెయ్యి ఎకరాల అభయారణ్యం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున దత్తత తీసుకోవాలని సంతోష్ కుమార్ నిర్ణయించారు. ఫిబ్రవరి 17 న కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తన నిర్ణయాన్ని ఎంపీ ప్రకటించారు.
Also Read
- WI Coach: వెస్టిండీస్ క్రికెట్‌ను కాపాడండి.. దయచేసి ఆర్థిక సాయం చేయండి.. హెడ్ కోచ్ డారెన్ సామీ ఆవేదన..
- YS Jagan: గెలుస్తామనే నమ్మకం చంద్రబాబుకు లేదు.. 2029 ఫినిషింగ్ లైన్!
- Shai Hope: "మా 20 ఏళ్ల కల నెరవేరలేదు.. అయినా నేను ఫుల్ హ్యాపీ".. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కీలక వ్యాఖ్యలు..
- West Bengal Govt: కోల్‌కతా తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.
Also Read : Hardik-Natasha: రెండోసారి పెళ్లి..ఫుల్లుగా తాగి చిందేసిన హార్దిక్-నటాషా
ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన కేసీఆర్, స్వరాష్ట్రం సిద్దించాక గత ఎనిమిదేళ్లుగా తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నారని, ఆయన తపనను అతి దగ్గరి నుంచి చూసిన వ్యక్తిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంపీ సంతోష్ కుమార్ వెల్లడించారు. ఆంజనేయుడి ప్రధాన లక్షణాలైన పరాక్రమం, విశ్వాసం కేసీఆర్ సొంతమని, అభివృద్ది నిర్ణయాల్లో పరాక్రమం, తెలంగాణ పట్ల ఆయన విశ్వాసం వెలకట్టలేనివని ఎంపీ అన్నారు. అన్ని రంగాల్లో అభివృద్దితో పాటు హరిత, ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లే తెలంగాణను సీఎం కాంక్షిస్తున్నారని, కాళేశ్వరం కట్టినా, యాదాద్రి పునర్ నిర్మాణం చేసినా, ఇప్పుడు కోటి మొక్కుల దేవుడు కొండగట్టు అంజన్న ఆలయం అభివృద్ది నిర్ణయమైనా కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమని అన్నారు.
Also Read : Tiger : బద్లాపూర్ తాండ అటవీ ప్రాంతంలో పులి సంచారం
చంద్రుడికో నూలు పోగు లాగా ఆయన వెన్నంటి, మద్దతుగా నిలవటం తనకు లభించిన వరంగా భావిస్తూ, ముఖ్యమంత్రి పుట్టిన రోజు పురస్కరించుకుని అంజన్న సన్నిధి వెన్నంటి ఉండే వెయ్యి ఎకరాలకు పైగా అభయారణ్యాన్ని దత్తత తీసుకుంటున్నానని సంతోష్ తెలిపారు. కొడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వచ్చే కంపార్టెమెంట్ 684లో 752 ఎకరాలు, 685లో 342 ఎకరాలు మొత్తం 1,094 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకుంటారు. మొదటి విడతగా కోటి రూపాయల వ్యయంతో ఈ వెయ్యి ఎకరాల అటవీ భూమికి మరింత పచ్చందాలు అద్దుతామని ఎంపీ ప్రకటించారు. దశల వారీగా మిగతా నిధులు కూడా అందించి లక్షిత పనులు పూర్తి చేస్తామని ఎంపీ తెలిపారు. చిన్నతనం నుంచే కేసీఆర్ వెంట ఉన్న తనకు కొండగట్టుతో బలమైన అనుబంధం ఉన్నదని, అనేక సార్లు ఆంజనేయుడిని దర్శించుకుని ఈ అటవీ ప్రాంతంలో సేదతీరిన అనుభూతులు ఉన్నాయని ఎంపీ అన్నారు.
ఐదు వందల ఏళ్లకు ముందే అస్థిత్వంలోకి వచ్చిన కొండగట్టు ఆలయంలో ఈ అడవిలో లభించే సుగంధ మొక్కలు, చందనం చెట్ల నుంచే పూజలు జరిగేవని ప్రతీతి. మళ్లీ ఆ వైభవం కోసం ఈ అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఔషధ మొక్కలు, సుగంధ మొక్కలు నాటుతామన్నారు. అటవీశాఖ అధ్వర్యంలో అటవీ భూమి సరిహద్దుకు రక్షణ చర్యలతో పాటు, అడవి లోపల పునరుజ్జీవన చర్యలు చేపడతామన్నారు. సహజ అడవి పునరుద్దరణకు చెక్ డ్యామ్ ల నిర్మాణంతో పాటు, నేలలో తేమ పరిరక్షణ చర్యలు చేపడతామన్నారు. ఆలయ పరిసరాల్లో పెద్ద ఎత్తున సంచరించే కోతులను అటవీ ప్రాంతానికి పరిమితం చేసేలా పెద్ద ఎత్తున పండ్ల మొక్కలు నాటి మంకీ ఫుడ్ కోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులు, పచ్చని ప్రకృతి మధ్య కాసేపు సేద తీరేలా పరిసరాలను తీర్చిదిద్దుతాని, మట్టితో వాకింగ్ ట్రాక్ తో పాటు, పగోడాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఏ లక్ష్యంతోనైతే ముఖ్యమంత్రి కొండగట్టు పునర్ నిర్మాణం చేపడుతున్నారో, దానికి మద్దతుగా తమ వంతు ప్రయత్నం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున ఉంటుందని సంతోష్ కుమార్ ప్రకటించారు.
తాజావార్తలు
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G లాంచ్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, Super AMOLED డిస్‌ప్లే!
-
WI Coach: వెస్టిండీస్ క్రికెట్‌ను కాపాడండి.. దయచేసి ఆర్థిక సాయం చేయండి.. హెడ్ కోచ్ డారెన్ సామీ ఆవేదన..
-
YS Jagan: గెలుస్తామనే నమ్మకం చంద్రబాబుకు లేదు.. 2029 ఫినిషింగ్ లైన్!
-
Shai Hope: “మా 20 ఏళ్ల కల నెరవేరలేదు.. అయినా నేను ఫుల్ హ్యాపీ”.. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కీలక వ్యాఖ్యలు..
-
West Bengal Govt: కోల్‌కతా తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!