ఏపీలో చింతామణి నాటకంపై నిషేధం వివాదాస్పదం అవుతోంది. నర్సాపురం ఎంపీ రఘురామ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంపై ఆర్యవైశ్య కార్పోరేషన్ ఛైర్మన్ మండిపడుతున్నారు. సుబ్బిశెట్టి పాత్రను వికృతంగా చిత్రీకరిస్తున్నారని అందుకే చింతామణి నాటకంపై నిషేధం విధించారన్నారు కార్పోరేషన్ ఛైర్మన్ కుప్పం ప్రసాద్. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. దీనికి రఘురామ ఏంచెబుతారంటూ నిలదీశారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం చింతామణి నాటకాన్ని నిషేధించడం తెలిసిందే. ఆర్యవైశ్య సంఘాల డిమాండ్ ను గౌరవిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే…
ఏపీలో స్వంత పార్టీ నేతలపైనే విమర్శలు చేస్తూ సంచలనం రేపుతున్నారు పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ఱంరాజు. తాజాగా ఆయనపై ట్వీట్లు చేసిన ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు రఘురామ. అంతకుముందు ప్రజలు తనను స్ఫూర్తిగా తీసుకుని పోరాడాలట! ఎన్నుకున్న వారిని వదిలేసి ఢిల్లీలో కూర్చున్న నీలో ఉన్నస్ఫూర్తి ఏంటో? బ్యాంక్‌లను వేల కోట్లకు ముంచి విలాసాలు వెలగబెట్టడమా? ఓట్లు వేసిన వారికే ముఖం చూపించలేని నీ పిరికితనాన్ని ఆదర్శంగా తీసుకోవాలా రాజా? ఆరడుగులున్నా…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. ఇప్పటికే ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలని లేఖలు రాసిన ఆయన.. తాజాగా మరో లేఖ రాశారు. వరుస లేఖలతో ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు రఘురామరాజు. పెళ్ళికానుక, షాదీ ముబారక్ పథకాలను ఈ లేఖలో ప్రస్తావించారు. అధికారంలోకి వస్తే… పెళ్ళికానుక సహాయం పెంచుతామని వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఈ సాయాన్ని లక్ష రూపాయలకు…