Rajinikanth Birthday: తెలుగు చిత్రసీమతో మొదటి నుంచీ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు అనుబంధం ఉంది. రజనీకాంత్ చిత్రసీమలో అడుగుపెట్టక ముందు బెంగళూరులో సిటీ బస్ కండక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ప్రతి రోజూ సెకండ్ షో చూడడం ఆయనకు అలవాటుగా ఉండేదట. అప్పట్లో రజనీకాంత్ ఎక్కువగా ఎన్టీఆర్ సినిమాలనే సెకండ్ షోస్ లో చూసేవారు. ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రాలంటే రజనీకాంత్‌కు ఎంతో ఇష్టం. ఎన్టీఆర్ ‘శ్రీకృష్ణ పాండవీయం’ చిత్రాన్ని బెంగళూరులో పలు మార్లు చూశానని…
Niluvu Dopidi: నటరత్న ఎన్టీఆర్, నటశేఖర కృష్ణ అన్నదమ్ములుగా నటించిన రెండవ చిత్రం ‘నిలువు దోపిడీ’. అంతకు ముందు వీరిద్దరూ ‘స్త్రీ జన్మ’లో అన్నదమ్ములుగానే అభినయించారు. విశేషమేమిటంటే, ఎన్టీఆర్‌తో కృష్ణ నటించిన ఐదు చిత్రాలలోనూ ఆయనకు తమ్మునిగానే నటించారు. కృష్ణ వర్ధమాన కథానాయకునిగా సాగుతున్న రోజుల్లో రూపొందిన ‘నిలువు దోపిడీ’ చిత్రాన్ని ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన యు.విశ్వేశ్వరరావు నిర్మించారు. తరువాతి రోజుల్లో విశ్వేశ్వరరావు కూతురును యన్టీఆర్ తనయుడు మోహన్ కృష్ణ వివాహం చేసుకోవడంతో వారిద్దరూ వియ్యంకులు కూడా…
Naga Shourya Birthday: ఇప్పటికే డజనుకు పైగా చిత్రాలలో యంగ్ హీరో నాగశౌర్య నటించేశాడు. వాటిలో కొన్ని అలరించాయి. మరికొన్ని జనాన్ని పులకరింపచేయలేకపోయాయి. దాంతో స్టార్ డమ్ కోసమై నాగశౌర్య ఇంకా శ్రమిస్తూనే ఉన్నాడని చెప్పాలి. అతను ఎంతగా కృషి చేస్తున్నాడో ‘లక్ష్య’ చిత్రం చూస్తే తెలుస్తుంది. ఆ తరువాత వచ్చిన నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’ సైతం ఆకట్టుకోలేక పోయింది. అయినా పట్టువదలని విక్రమార్కునిగా సాగుతున్న నాగశౌర్య ఈ యేడాది ఏకంగా మూడు చిత్రాలతో మురిపించే…
ANR Vardanti: ఉత్తరాదిన ‘ట్రాజెడీ కింగ్’ అనగానే మహానటుడు దిలీప్ కుమార్ ను గుర్తు చేసుకుంటారు. దక్షిణాదిన ముఖ్యంగా తెలుగు చిత్రసీమలో ఆ ‘ట్రాజెడీ కింగ్’ అన్న మాటకు ప్రాణం పోశారు మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు. భగ్నప్రేమికులను చూడగానే పాత కథలు గుర్తు చేసుకుంటూ ఉంటారు జనం. అలా విఫలమై ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రేమకథల్లో మనకు ముందుగా ‘రోమియో-జూలియట్’,’లైలా-మజ్ను’ వంటివి కనిపిస్తాయి. తరువాత మన దేశం విషయానికి వస్తే ‘సలీమ్- అనార్కలి’, ‘దేవదాసు’ కథలూ స్ఫురిస్తాయి.…
NTR Death Anniversary: తెలుగువారి మదిలో ‘అన్న’గా నిలిచిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు అవనిని వీడి అప్పుడే 27 ఏళ్ళవుతోంది. అయినా ఆయన తలపులు తెలుగువారిని సదా వెన్నాడుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ మరణం తరువాత తరలివచ్చిన తరాలు సైతం యన్టీఆర్ నామస్మరణ చేస్తూనే ఉండడం విశేషం. అందుకు చలనచిత్రసీమలోనూ, రాజకీయ రంగంలోనూ ఎన్టీఆర్ సాగించిన అనితరసాధ్యమైన పయనమే కారణమని చెప్పక తప్పదు. ఎన్టీఆర్ అన్న మూడక్షరాలు వింటే చాలు తెలుగువారి మది పులకించి పోతుంది.…
తెలుగునాట పుట్టినా, భారతీయ చిత్రసీమలోనే తనదైన బాణీ పలికిస్తూ సాగిన ఘనులు దర్శకనిర్మాత నటులు ఎల్.వి.ప్రసాద్. ఆయన చిత్రాల ద్వారా మేటి నటులు చిత్రసీమలో తమ బాణీ పలికించారు. తెలుగు, తమిళ చిత్రరంగాల్లో ఎల్వీ ప్రసాద్ పేరు ఈ నాటికీ మారుమోగుతూనే ఉంది. భారతదేశంలోని ప్రధాన చిత్రపరిశ్రమల్లో ఎల్వీ ప్రసాద్ అన్నది ఓ బ్రాండ్ నేమ్. వారి ప్రసాద్ ల్యాబ్స్ , ఔట్ డోర్ యూనిట్స్ , ఇఎఫ్ఎక్స్ , ప్రసాద్ ఐమాక్స్ అన్నీ సినీజనానికి సుపరిచితాలు.…
45 Years Of Sati Savitri: కొన్ని సినిమాల్లో కథానుగుణంగా కొందరు నటీనటులు వేసిన చిన్న వేషాలే, తరువాతి రోజుల్లో సదరు నటులతోనే పూర్తి స్థాయిలో చిత్రాలుగా రూపొందిన సంఘటనలు తెలుగు చిత్రసీమలో చోటు చేసుకున్నాయి. అలా మహానటుడు నటరత్న యన్.టి.రామారావు నటజీవితంలో కొన్ని పాత్రలు మొదట బిట్ రోల్స్ లో కనిపించి, తరువాత పూర్తి స్థాయిలో అలరించిన సందర్భాలున్నాయి. ఆయన శ్రీరామునిగా తెరపై కనిపించిన తొలి చిత్రం ‘చరణదాసి’. అందులో ఓ డ్రీమ్ సాంగ్ లో…
Aatma Bandhuvu: సారథి సంస్థ భాగ్యనగరంలో ‘శ్రీసారథి స్టూడియోస్’ నిర్మించి, అనేక మహత్తరమైన చిత్రాలను తెరకెక్కించింది. అందులో మహానటుడు యన్.టి.రామారావుతో ఈ సంస్థ రెండు సూపర్ హిట్స్ నిర్మించడం, అవి రెండూ శివాజీగణేశన్ తమిళ చిత్రాలకు రీమేక్ కావడం విశేషం! వాటిలో మొదటిది ‘కలసివుంటే కలదుసుఖం’ కాగా, రెండవది ‘ఆత్మబంధువు’. ఈ రెండు చిత్రాలలోనూ సావిత్రి నాయికగా నటించడం మరో విశేషం! ‘కలసివుంటే కలదు సుఖం’కు తమిళ ఒరిజినల్ ‘భాగ పిరివినై’, ‘ఆత్మబంధువు’కు ‘పడిక్కాద మేధై’ మాతృక.…
Victory Venkatesh: ప్రస్తుతం నవతరం కథానాయకుల్లో ఎంతోమంది నిర్మాతల తనయులు హీరోలుగా సాగుతున్నారు. వారందరికీ రోల్ మోడల్ ఎవరంటే ‘విక్టరీ’ వెంకటేష్ అనే చెప్పాలి. నిర్మాతల వారసుల్లో నటులుగా మారి ఘనవిజయం సాధించిన స్టార్ హీరోగా వెంకటేష్ తనదైన బాణీ పలికించారు. ఆయన సక్సెస్‌ను చూసిన తరువాతే ఎంతోమంది నిర్మాతలు తమ కుమార రత్నాలను హీరోలుగా పరిచయం చేయడానికి పరుగులు తీశారు. అయితే ఇప్పటి దాకా ఎవరూ వెంకటేష్ స్థాయి విజయాలను అందుకోలేదు. ఒకప్పుడు వరుస విజయాలతో…
Surender Reddy Birthday: అక్కినేని అఖిల్ తాజా చిత్రం ‘ఏజెంట్’ ట్రైలర్ చూసిన వారికి అందులోని యాక్షన్ పార్ట్ నచ్చి ఉంటుంది. అది చూడగానే డైరెక్టర్ ఎవరా అని చూస్తే కనిపించే పేరు – సురేందర్ రెడ్డి. అయితే ‘సరే’… సురేందర్ రెడ్డి సినిమా అంటే ఆ మాత్రం యాక్షన్ ఉండి తీరుతుందని సగటు ప్రేక్షకుడు ఇట్టే నిర్ణయించేసుకుంటాడు. తొలి చిత్రం ‘అతనొక్కడే’ మొదలు మొన్నటి ‘సైరా నరసింహారెడ్డి’ దాకా తన ప్రతి సినిమాలో యాక్షన్ లోనూ…