20 Years Of Khadgam: దర్శకుడు కృష్ణవంశీ తన చిత్రాలలో దేశభక్తిని, జాతీయ సమైక్యతను, ఆదర్శభావాలను, పోరాట పటిమను పొందు పరుస్తూ సాగారు. ఆ తీరున ఆయన తెరకెక్కించిన ‘ఖడ్గం’లోనూ ఈ అంశాలన్నీ మనకు కనిపిస్తాయి. దుష్కర చర్యల ముష్యర మూకలు ఓ వైపు, దేశభక్తిని నింపుకున్న హృదయాలు మరోవైపు సాగించిన పోరాటంలో భారతీయులదే అంతిమ విజయం అంటూ ‘ఖడ్గం’ చిత్రం చాటింది. 2002 నవంబర్ 29న విడుదలైన ఈ మూవీ విజయం సాధించింది. ‘ఖడ్గం’ కథ…
Panduranga Mahatyam: ఎన్టీ రామారావును మహానటునిగా తీర్చిదిద్దిన చిత్రాలలో ‘పాండురంగ మహాత్మ్యం’ స్థానం ప్రత్యేకమైనది. ఈ చిత్రానికి ముందు ఎన్టీఆర్ అనేక చిత్రాలలో విలక్షణమైన పాత్రలు పోషించినా, భక్త పుండరీకునిగా ఇందులో ఆయన అభినయం అశేష ప్రేక్షకలోకాన్ని అలరించింది. ఈ నాటికీ ఆకట్టుకుంటూనే ఉండడం విశేషం! ఎన్టీఆర్ తమ ఎన్.ఏ.టి. పతాకంపై ఈ చిత్రాన్ని కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో తన తమ్ముడు ఎన్.త్రివిక్రమరావు నిర్మాతగా తెరకెక్కించారు. 1957 నవంబర్ 28న విడుదలైన ‘పాండురంగ మహాత్మ్యం’ విజయఢంకా మోగించింది.…
Ravi Shankar Birthday: నటుడు రవిశంకర్ అంటే చప్పున గుర్తుకు రాకపోవచ్చు. కానీ ‘బొమ్మాళీ… నిన్నొదల..’ అంటూ ఆయన గళం చేసిన మాయాజాలాన్ని జనం ఎప్పటికీ మరచిపోలేరు. అన్న సాయికుమార్, తండ్రి పి.జె.శర్మ చూపిన బాటలోనే పయనిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు రవిశంకర్. ఆయన గళవిన్యాసాలతో పలు చిత్రాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అనువాద చిత్రాలలో ప్రతినాయకులకు రవిశంకర్ గళం ప్రాణం పోసిందనే చెప్పాలి. పూడిపెద్ది రవిశంకర్ 1966 నవంబర్ 28న మద్రాసులో జన్మించారు. ఆయన…
Dhakshina Murthy: ‘సంసారం సంసారం.. ప్రేమ సుధా తీరం.. నవజీవన సారం..’ అన్న మధురాన్ని 1950లో ‘సంసారం’ కోసం పలికించిన సుస్వరాల సుసర్ల దక్షిణా మూర్తి స్వరప్రయాణం తెలుగువారి మది పులకింపచేస్తూ సాగింది. గానకోకిల లతామంగేష్కర్ స్వరవిన్యాసాలను తెలుగులో తొలుత వినిపించిందీ ఆయనే. ‘సంతానం’లో లత పాడిన ‘నిదుర పోరా తమ్ముడా…’ గానం ఈ నాటికీ సంగీత ప్రియులను మురిపిస్తూనే ఉంది. ‘ఇలవేల్పు’ లోనూ ‘చల్లని రాజా ఓ చందమామ..’ పాటతో నిజంగానే ప్రేక్షకుల మదిలో చల్లని…
Prabhas Eeshwar: అప్పటికే తెలుగు చిత్రసీమలో వారసుల హవా విశేషంగా వీస్తోంది. టాప్ ఫోర్‌లో ముగ్గురు సినిమా రంగానికి చెందిన వారసులే. తరువాతి తరం టాప్ స్టార్స్ లోనూ మహేష్, జూనియర్ ఎన్టీఆర్ వంటివారు అలరిస్తున్న సమయమది. తమ అభిమాన హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసునిగా ఆయన తమ్ముని తనయుడు ప్రభాస్ అరంగేట్రం చేస్తున్నారని తెలియగానే ఫ్యాన్స్ ఆనందంతో చిందులు వేశారు. ప్రభాస్ కు ‘యంగ్ రెబల్ స్టార్’ అంటూ టైటిల్ ఇచ్చేసి ఆయన మొదటి…
Prabhas @ 20 Years: ‘బాహుబలి’గా భళారే అనిపించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటునిగా ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. ఆయన తొలి చిత్రం ‘ఈశ్వర్’ నవంబర్ 11తో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంటోంది. 2002 నవంబర్ 11న విడుదలైన ‘ఈశ్వర్’ చిత్రం ప్రభాస్ ను అభిమానుల మదిలో ‘యంగ్ రెబల్ స్టార్’గా నిలిపింది. అప్పటి నుంచీ ఇప్పటి దాకా ప్రభాస్‌ను ఫ్యాన్స్ అదే తీరున ఆదరిస్తున్నారు. ఆయన జయాపజయాలతో నిమిత్తం లేకుండా ప్రభాస్ కు…
Krish Jagarlamudi: దర్శకుడు క్రిష్ పేరు వింటే చాలు ఆయన తెరకెక్కించిన వైవిధ్యమైన చిత్రాలు మన మదిలో చిందులు వేస్తాయి. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ ‘హరిహర వీరమల్లు’ తెరకెక్కిస్తున్నారు. జానపద చిత్రంగా తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ పార్టీ ‘జనసేన’ ఆశయాలు కూడా పొందుపరిచారని తెలుస్తోంది. దీంతో ఆ సినిమాపై పవన్ ఫ్యాన్స్ మరింత ఆసక్తి నెలకొంది. క్రిష్ అసలు పేరు జాగర్లమూడి రాధాకృష్ణ. ఆయన 1978…
Tatineni Ramarao: ఒకప్పుడు భారతీయ సినిమా అంటే హిందీ సినిమానే అనే తీరున వెలిగింది. ప్రస్తుతం హిందీ చిత్రసీమ టాలీవుడ్ వైపే ఎక్కువగా దృష్టి సారిస్తోంది. ఇప్పటి దర్శకుల దిగ్విజయాల కారణంగానే తెలుగు సినిమా రంగంవైపు హిందీవాళ్ళు దృష్టి కేంద్రీకరించారని నవతరం ప్రేక్షకులు పొరబడుతున్నారు. మన దర్శకులు, నటీనటుల కోసం ఉత్తరాదివారు ఆసక్తిగా ఎదురుచూసిన సందర్భాలు బోలెడు ఉన్నాయి. అలా హిందీ చిత్రాలతో వెలుగు చూసిన తెలుగు దర్శకులు ఎందరో ఉన్నారు. వారిలో తాతినేని రామారావు ప్రత్యేక…
BN Reddy: తెలుగునాట ‘బ్రదర్’ అన్న పిలుపు వినగానే, మనకు నటరత్న ఎన్టీఆర్ గుర్తుకు రాకమానరు. ‘బ్రదర్’ అన్న మాటను ఎన్టీఆర్, ఏఎన్నార్ పరస్పరం పిలుచుకోవడం ద్వారా తెలుగు చిత్రసీమలో పాపులర్ చేశారని చెప్పక తప్పదు. అయితే, ఆ మాట వినగానే ముందుగా ఎన్టీఆర్ గుర్తుకు రావడానికి కారణం, ఆయన తనకు పరిచయమైన వారిలో తొంభై శాతం మందిని ‘బ్రదర్’ అంటూనే సంబోధించేవారు. అందువల్ల ‘బ్రదర్’ అనగానే అన్న ఎన్టీఆర్ గుర్తుకు రాకమానరు. అయితే ఆ మాటను…
Manjula Ghattamaneni: తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోస్ ఫ్యామిలీస్ నుండి అమ్మాయిలు నటించడం అన్నదానికి శ్రీకారం చుట్టింది ఎన్టీఆరే. ఆయన కూతురు భువనేశ్వరి (చంద్రబాబు నాయుడు భార్య) బాలనటిగా ‘మనుషుల్లో దేవుడు’ చిత్రంలో కాసేపు తెరపై శ్రీకృష్ణునిగా కనిపించారు. ఆ తరువాత ‘దానవీరశూర కర్ణ’ కోసం ఓ పాటను పురంధేశ్వరి, భువనేశ్వరిపై చిత్రీకరించినా, ఎందుకనో ఆ సాంగ్‌ను సినిమాలో తొలగించారు. ఎన్టీఆర్‌ను అనేక విషయాల్లో స్ఫూర్తిగా భావించే కృష్ణ సైతం తన రెండో కూతురు మంజులను బాలనటిగానటింప…