నవతరం హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుని సాగుతున్నాడు సత్యదేవ్. తాజాగా ‘గాడ్సే’తో జనం ముందుకు వచ్చిన సత్యదేవ్ వైవిధ్యం కోసం తపిస్తూ ఉంటాడని ఇట్టే తెలిసిపోతుంది. సత్యదేవ్ కంచరణ 1989 జూలై 4న వైజాగ్‌లో జన్మించారు. విశాఖపట్నంలోనే ఇంటర్మీడియట్ దాకా చదువుకున్న సత్యదేవ్ విజయనగరంలోని ‘ఎమ్.వి.జి.ఆర్. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్’లో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ చేశారు. 2016 దాకా ఐబీయమ్, వియమ్ వేర్ సంస్థల్లో పనిచేసిన సత్యదేవ్ తరువాత సినిమాలపై ఆసక్తి పెంచుకున్నాడు. కొన్ని లఘు…
జనాన్ని కట్టి పడేయాలంటే వైవిధ్యాన్ని పట్టేసుకోవాలి.. మరీ చుట్టేసుకోవాలి. అల్లు అర్జున్ అదే పంథాలో పయనిస్తున్నారు. నటనతోనే కాదు, లుక్స్‌తో, వరైటీ కాస్ట్యూమ్స్‌తో, గెటప్స్‌తో స్టైలిష్ స్టార్‌గా జనం మదిలో నిలిచారు అల్లు అర్జున్. బన్నీ వైవిధ్యమే ఆయనను సక్సెస్ రూటులో సాగేలా చేస్తోందని చెప్పవచ్చు. అల్లు అర్జున్ 1982 ఏప్రిల్ 8న మద్రాసులో జన్మించారు. తాత అల్లు రామలింగయ్య మహా హాస్యనటుడు. తండ్రి అల్లు అరవింద్ నిర్మాతగా ఎంతో పేరున్నవారు. మరోవైపు మేనమామ చిరంజీవి అభినయం…
ప్రస్తుతం రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్.’పైనే సినీ అభిమానుల్లో చర్చ సాగుతోంది. దాదాపు 36 ఏళ్ళ తరువాత వచ్చిన అసలు సిసలు మల్టీస్టారర్ మూవీ ఇదే కావడంతో ఆ చర్చ మరింతగా మురిపిస్తోంది. ఈ మధ్య వచ్చిన మల్టీస్టారర్స్ లో ఓ సీనియర్ స్టార్ తో తరువాతి తరం స్టార్ హీరో నటించారు తప్ప, సమకాలికులు, సమ ఉజ్జీలయిన స్టార్స్ కలసి నటించలేదు. అది రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్.’తోనే సాధ్యమైంది. ఇందులో నవతరం అగ్రకథానాయకులైన జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్…
నాటి మేటి నటుల్లో ఒకరైన టి.యల్. కాంతారావు పేరు చెప్పగానే ఆయన కత్తి పట్టి కదం తొక్కిన చిత్రాలు, నారద పాత్రతో అలరించిన వైనం గుర్తుకు వస్తాయి. సాంఘిక చిత్రాల్లోనూ కాంతారావు హీరోగా అలరించారు. రాజలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై సుందర్ లాల్ నహతా, డూండీ నిర్మించిన సాంఘిక చిత్రాలలోనూ కాంతారావు నటించి ఆకట్టుకున్నారు. సుందర్ లాల్ నహతా, డూండీ నిర్మించిన ‘ఖైదీ కన్నయ్య’ చిత్రంలో కాంతారావు హీరోగా నటించారు. 1962 మార్చి 1న విడుదలయిన ఈ చిత్రం…
‘కృషితో నాస్తి దుర్భిక్షమ్’అనే నానుడిని నిజం చేసిన వారు అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి వారిలో కృష్ణంరాజు స్థానం ప్రత్యేకమైనది. తొలి చిత్రం పరాజయం చవిచూసినా, పట్టువదలని విక్రమార్కునిలా చిత్రసీమలో పలు పాట్లు పడ్డారు. చివరకు కోరుకున్న విజయం సాధించారు. జనం మదిలో ‘రెబల్ స్టార్’గా నిలచిపోయారు. కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఆయన జన్మించారు. చదువుకొనే రోజుల నుంచీ కృష్ణంరాజుకు ఫోటోలు తీయడమంటే…
అనుకున్నది సాధించే దిశగా అడుగులు వేసి విజయాలను అందుకోవడం కొందరికే సాధ్యమవుతుంది. ఏదో ఒకరోజున తాను సినిమాకు దర్శకత్వం వహిస్తానని ముందుగానే చెప్పి, మరీ దర్శకురాలిగా మారారు బి.జయ. అసలే పురుషాధిక్య ప్రపంచంలో అందునా సినిమా రంగంలో ఎలా రాణిస్తావు? అని ఎందరో ఆమెను ప్రశ్నించిన వారున్నారు. వారందరికీ మెగాఫోన్ పట్టి సమాధానం చెప్పారామె. తెలుగు చిత్రసీమలో దర్శకత్వంలో రాణించే మహిళలు అరుదు. అలాంటి పరిస్థితుల్లో దర్శకురాలిగా తనదైన బాణీ పలికించి భళా అనిపించారు జయ. కలిదిండి…
(డిసెంబర్ 14తో కాబులీవాలాకు 60 ఏళ్ళు)విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ మాతృభాష బెంగాలీలో అనేక కథలు రచించారు. వాటిలో కాబులీవాలా ప్రత్యేకమైనది. అందులో మానవత్వం మన మదిని తడుతుంది. బంధాలు-అనుబంధాల్లోని మాధుర్యం మనను వెంటాడుతుంది. అందుకే గొప్పకథల్లో ఒకటిగా కాబులీవాలా వెలుగొందుతూనే ఉంది. ఈ కథను పలు యూనివర్సిటీలు పాఠ్యాంశంగానూ నెలకొల్పిన సందర్భాలున్నాయి. ఈ కథ ఆధారంగా ప్రముఖ హిందీ బెంగాలీ చిత్ర దర్శకులు బిమల్ రాయ్, లీలా దేశాయ్ తో కలిసి కాబులీవాలా చిత్రాన్ని హిందీలో నిర్మించారు.…