విజయ్‌దేవరకొండ, రష్మిక జంట త్వరలో వివాహం చేసుకుంటుందని బాలీవుడ్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. వీటిని ఆసరా చేసుకుని తెలుగు మీడియా కూడా ఈ ఏడాదిలోనే విజయ్, రష్మిక జోడీ పెళ్లి పీటలు ఎక్కబోతుందని వార్తలు వండి వారుస్తోంది. ఇటీవల రష్మిక తన ప్రియుడు రోహిత్ శెట్టితో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లు అయ్యింది. ఈ జోడీ చేసింది రెండు సినిమాలే అయితే వారి కెమిస్ట్రీ ఆన్‌స్కీన్ మీద చూడముచ్చటగా ఉంటుంది.…
కర్ణాటక బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప మళ్లీ సీఎం కాబోతున్నారు. అయితే ఇది నిజంగా కాదండోయ్. కేవలం సినిమా వరకే పరిమితం. సినిమాల్లో పేరు తెచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పిన చాలామందిని మనం చూశాం. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నారు. ఆయన రాజకీయాల్లో ఆరితేరి ఇప్పుడు ముఖానికి రంగేసుకుంటున్నారు. తనూజ అనే సినిమాతో యడ్యూరప్ప తెరంగేట్రం చేస్తున్నారు. ఓ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో యడ్యూరప్ప సీఎంగా నటిస్తున్నారు. హరీష్…
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈటీ’. ఎవరికీ తలవంచడు అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్. ఈ సినిమా తెలుగు టీజర్‌ను చిత్ర యూనిట్ శనివారం విడుదల చేసింది. ఈ సినిమాలో సూర్య డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తున్నాడు. చాలా కాలం తర్వాత మాస్ పాత్రలో అభిమానులను అలరిస్తాడని టీజర్ చూస్తే తెలిసిపోతుంది. నాతో ఉండేవేళ్ళెప్పుడూ భయపడకూడదు.. మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అంటూ సూర్య చెప్పే మాస్ డైలాగ్స్ టీజర్‌లో ఆకట్టుకుంటున్నాయి. సన్…
మంచు మోహన్‌బాబు కుటుంబసభ్యులపై కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఏపీలో సినిమా టిక్కెట్ ధరల అంశం, సన్నాఫ్ ఇండియా మూవీ అడ్వాన్స్ బుకింగ్స్, కలెక్షన్లు.. ఇలా ప్రతి అంశం సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచు విష్ణుకు చెందిన నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ తరఫున హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు శేషు కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. మంచు ఫ్యామిలీపై వస్తున్న ట్రోల్స్‌ను తక్షణమే తొలగించకపోతే చర్యలు…
అభిరామ్.ఎం దర్శకత్వంలో ప్రియాంక శర్మ కీలక పాత్రను పోషిస్తున్న చిత్రం ‘డై హార్డ్ ఫ్యాన్’. సెలెబ్రిటీకీ – అభిమానికి మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ డ్రామానే ఈ చిత్రకథాంశం. ఇందులో సెలబ్రిటీగా ప్రియాంక శర్మ నటిస్తుంటే, ఆమె అభిమాని పాత్రను శివ ఆలపాటి పోషిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య సాగే డ్రామా ఆసక్తికరంగా ఉంటుంది. తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న షకలక శంకర్, రాజీవ్ కనకాల ఫస్ లుక్ పోస్టర్స్ ను చిత్ర బృందం…
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ట్రైలర్ విడుదల తేదీని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈనెల 21న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా తెలిపింది. దీంతో శనివారం ట్రైలర్ విడుదల కావడం లేదని తేలిపోయింది. అటు ఈనెల 21న భీమ్లా నాయక్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ పెద్ద ఎత్తున జరగబోతోంది. ఈ వేడుకకు మంత్రి కేటీఆర్‌తో పాటు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా వస్తున్నట్లు చిత్ర…
లగడపాటి శిరీషా, శ్రీధర్ దంపతులది చిత్రసీమలో సుదీర్ఘ ప్రయాణం. 2005లో ‘ఎవడిగోల వాడిది’తో మొదలైన ఆ ప్రయాణం మొన్న ‘నా పేరు సూర్య’ వరకూ అప్రతిహతంగా సాగింది. బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించి, మెప్పించిన వారి తనయుడు విక్రమ్ సహిదేవ్ ఇప్పుడు హీరోగా ఎదిగాడు. అతన్ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ వారు తీసిన యూత్ ఫుల్ మూవీ ‘వర్జిన్ స్టోరీ’ శుక్రవారం జనం ముందుకు వచ్చింది. ఇది వన్ నైట్ లో జరిగే కథ. అంతేకాదు… వన్…
కొంతమందికి నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు సినిమా టైటిల్స్ భలేగా అచ్చి వస్తాయి. మహేశ్ బాబుకు అక్కినేని పాత సినిమా టైటిల్స్ ‘యువరాజు, శ్రీమంతుడు’ కలసి వచ్చాయి. అదే తీరున నాటి స్టార్ కమెడియన్ సునీల్ కూడా ‘అందాల రాముడు’, ‘పూలరంగడు’ వంటి ఏయన్నార్ సినిమా టైటిల్స్ తో గ్రాండ్ సక్సెస్ పట్టేశారు. ‘అందాలరాముడు’తో హీరోగా సక్సెస్ చూశారు సునీల్. తరువాత కొన్ని సినిమాల్లో హీరో స్థాయి పాత్రలు ధరించారు. ఆ పై రాజమౌళి ‘మర్యాద రామన్న’తో బంపర్…
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. ఫిబ్రవరి 25న థియేటర్లలో ఈ మూవీని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సినిమాలో రానా విలన్‌గా నటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అభిమానులకు ఫీస్ట్ అందించనున్నాడు. తమన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్…
ప్రముఖ నిర్మాతలు లగడపాటి శిరీష, శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘వర్జిన్ స్టోరీ’. ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వంలో శిరీషా శ్రీధర్ ఈ మూవీని నిర్మించారు. ఈ నెల 18న సినిమా జనం ముందుకొస్తున్న నేపథ్యంలో మీడియా మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. ‘యువత కోణంలో సాగే చిత్రమిది. వాళ్ల ఆలోచనలకు ప్రతిబింబంలా ఉంటుంది. 16 ఏళ్లకు అమ్మాయి, అబ్బాయి కొత్తగా రెక్కలొచ్చినట్లు ఫీలవుతారు. యువత లైఫ్…