దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రెండింగ్‌లో ఉన్న విషయాలపై మాట్లాడుతూ సోషల్ మీడియాలో హైలెట్ అవుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ సినిమా గురించి సోషల్ మీడియా హీటెక్కిపోతోంది. ఒకవైపు ట్రైలర్, మరోవైపు ప్రి రిలీజ్ ఈవెంట్ గురించి తెగ చర్చ నడుస్తోంది. దీంతో భీమ్లానాయక్ ట్రైలర్‌పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
భీమ్లా నాయక్ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాను భీమ్లా నాయక్ అని కాకుండా డానియల్ శేఖర్ అని పిలవాలని అనిపిస్తోందని వర్మ అభిప్రాయపడ్డాడు. రానా దగ్గుపాటిని ప్రమోట్ చేసేందుకు మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్‌ను ఉపయోగించారన్నాడు. ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ కంటే రానాకే హైప్ వచ్చిందని ఆర్జీవీ తెలిపాడు. దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానిగా తాను చాలా హర్ట్ అయ్యానని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం వర్మ చేసిన ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
From watching #BheemlaNayakTrailer it looks like the makers for some reason have used and abused @PawanKalyan to promote @RanaDaggubati ..I am hurted as a fan of P K
— Ram Gopal Varma (@RGVzoomin) February 21, 2022