Mopidevi Venkataramana: వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలకు మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణం, ప్రస్థానంలో ఎన్నో మైలు రాళ్లు, ఎన్నెన్నో ఒడి దుడుగులు ఎదుర్కొన్నాను అని తెలిపారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి.. రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఇప్పటికే రాజీనామా చేసిన సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు.. ఈ రోజు టీడీపీ గూటికి చేరనున్నారు.. సాయంత్రం 6 గంటలకు ఉండవల్లిలోని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ఆయన సమక్షంలో.. టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.. ఇక, ఈ ఇద్దరు మాజీ ఎంపీల వెంట పెద్ద సంఖ్యలో అనుచరులు కూడా టీడీపీ కండువాకప్పుకుంటారని తెలుస్తోంది..
రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేశారు. పార్లమెంట్‌లో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కడ్‌కు రాజీనామా పత్రాలను సమర్పించారు. వీరి రాజీనామా లేఖలను రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించినట్లు ప్రకటన వెలువడింది.
ఏపీలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి బిగ్ షాక్ తగిలింది.. రాజ్యసభ సభ్యత్వానికి ఆ పార్టీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు రాజీనామా చేశారు. ఢిల్లీలో ఈ రోజు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు కలిసి రాజీనామా లేఖలు సమర్పించారు ఇరువురు నేతలు.. అంతేకాదు.. వైసీపీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.. అంతేకాదు.. వారి అడుగులు టీడీపీ వైపు పడుతున్నాయి..
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.. ఇప్పుడు ఇద్దరు రాజ్యసభ సభ్యులు.. తమ పదవులతో పాటు.. పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధం అయ్యారు.. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు.. ఈ రోజు పార్టీకి, పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది..
సామాజిక యాత్ర పై వాడ వాడలా చర్చ జరుగుతుంది అని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఏపీ సీఎం చేసిన అభివృద్ధి,సంక్షేమం పై చర్చ జరుగుతుంది.. పేదరికాన్ని తొలగించాలన్న నినాదంతో ముఖ్యమంత్రి జగన్ పని చేస్తున్నారు.
Mopidevi Planning for next generation leaders : ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో అప్పుడే ఎన్నికల హడావుడి మొదలైంది. పార్టీలు నిర్వహిస్తున్న బహిరంగ సభలతో ప్రజల్లో చర్చ కూడా జరుగుతోంది. వ్యూహాలకు పదును పెడుతున్నారు నాయకులు. అధిష్ఠానం అభ్యర్థుల మార్పునకు సంకేతాలు ఇస్తే.. ఆ ప్రత్యామ్నాయం కూడా తామే చూపించేలా ప్లాన్ చేస్తున్నారట కొందరు ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని కొన్నిచోట్ల.. సామాజిక, రాజకీయ అంశాలు మరికొన్నిచోట్ల అభ్యర్థుల మార్పుకు కారణంగా…
సంక్షేమ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ అప్పులు చేయడం అనివార్యమని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ అన్నారు. గుంటూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రూ.6 లక్షల కోట్లు అప్పులు చేసిందని, అయితే అభివృద్ధి జరగడం లేదని, జగన్ ఫెయిల్యూర్ సీఎం అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అప్పులు చేయని రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. జ్యోతిబా ఫూలే వంటి…