సామాజిక యాత్ర పై వాడ వాడలా చర్చ జరుగుతుంది అని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఏపీ సీఎం చేసిన అభివృద్ధి,సంక్షేమం పై చర్చ జరుగుతుంది.. పేదరికాన్ని తొలగించాలన్న నినాదంతో ముఖ్యమంత్రి జగన్ పని చేస్తున్నారు.. ఎన్నికల హామీలను అమలు చేస్తున్న సీఎం జగన్.. సీఎం జగన్ ప్రతి పేదవాడి జీవితం లో వెలుగు చూడాలన్న లక్ష్యం తో పని చేస్తున్నారు.. ఓటు బ్యాంక్ రాజకీయం గా మాత్రమే గతం లో సామాజిక సాధికారత ఉండేది అని ఆయన ఆరోపించారు.
Read Also: Team India: ఇండియా-ఆస్ట్రేలియా టీ 20 సిరీస్.. యువ ఆటగాడికి కెప్టెన్సీ బాధ్యతలు..!
కానీ, సీఎం జగన్ వెనుకబడిన వర్గాలకు ఆర్థిక స్వాలంభన అందించడటమే లక్షంగా పని చేస్తున్నారు అని వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ తెలిపారు. రాజ్యసభ సీటు అంటే బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రమే దక్కేది.. కానీ వెనుక బడిన వర్గాలకు, బీసీలకు రాజ్యసభ అవకాశాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్ ది.. జగన్ ను ఎందుకు పరిపాలన నుండి దించాలో ప్రతిపక్షాలు చెప్పాలి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు చేస్తున్న ప్రభుత్వాన్ని ఎందుకు దించాలో చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. అణగారిన వర్గాలకు మరింత మేలు జరగాలంటే మళ్ళీ జగనే సీఎం అవ్వాలి అని పిలుపునిచ్చారు. 2024లో మరో సారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఎంపీ మోపిదేవి అన్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చి మళ్లీ జగన్ సీఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ-జనసేన పార్టీలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని విమర్శించారు.