హైదరాబాద్ మూసారాంబాగ్ లో ఉన్న ఒక రెడ్ రోజ్ బేకరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడటంతో స్థానికులు భయం తో పరుగు తీశారు. మంటలను ఆర్పేందుకు ఐదు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని విజయవంతంగా మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఎటువంటి గాయాలు కాలేదు. అయితే, భారీగా ఆస్తి నష్టం జరిగింది అని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని…
Moosarambagh: హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండిపోయాయి. అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూసీ నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది.
హైదరాబాద్ మూసారాంబాగ్ లోని ఓ ప్రింటింగ్ ప్రెస్ లో పోలీసుల సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. ఈ ప్రింటింగ్ ప్రెస్‌లో నిషేధిత మావోయిస్టు సాహిత్యం ప్రింట్ చేస్తున్నారన్న సమాచారం లభించింది. దీంతో సోదాలు నిర్వహించారు. మావోయిస్ట్ నేత,ఇటీవల మరణించిన ఆర్కే జీవిత చరిత్రను ప్రింట్ చేస్తున్నట్టు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన డీసీపీ రమేష్ రెడ్డి సోదాలు నిర్వహించారు. నవ్య ప్రింటింగ్ ప్రెస్‌లో ఈ సోదాలు జరిగాయి. పీవోడబ్ల్యూ సంధ్య కు చెందిన నవ్య ప్రింటింగ్…
గత మూడు రోజులుగా భాగ్యనగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఈరోజు మధ్యాహ్నం సమయం నుంచి భారీ వర్షం కురుస్తున్నది. ఈ వర్షాలకు రోడ్లు నీటమునిగాయి. ఇక్కడికక్కడ ట్రాఫిక్ స్థంభించిపోయింది. ఇక గండిపేటకు భారీగా వరద నీరు చేరుకోవడంతో నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. గండిపేటకు పర్యాటకులను అనుమతించడం లేదని అధికారులు పేర్కొన్నారు. మూసీ పరివాహ ప్రాంతంలోకి వరద నీరు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అంబర్‌పేట్- మూసారాంబాగ్ వంతెన…