తుఫాన్ సమయంలో ప్రజలకు అండగా నిలిచాం.. గుంటూరు జిల్లా తెనాలిలో మొంథా తుఫాన్ బాధితులకు మంత్రి నాదెండ్ల మనోహర్ నిత్యావసర సరుకులు, ఆర్థిక సాయం పంపిణీ చేశారు. చంద్రబాబు కాలనీలో పునరావాస కేంద్రాల్లో ఉన్న 615 మందికి మూడు రోజులకు సరిపోయే నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల, కలెక్టర్ తమీమ్ అన్సారియా, సబ్ కలెక్టర్ సంజనా సింహతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. అధికార…
ఆంధ్రప్రదేశ్‌పై విరుచుకుపడిన మొంథా తుఫాన్ భారీ నష్టాన్ని మిగిల్చింది. రాష్ట్రవ్యాప్తంగా పంటలు, ఆస్తులు, మౌలిక సదుపాయాలకు గణనీయమైన నష్టం వాటిల్లినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్‌పై విరుచుకుపడిన మొంథా తుఫాన్ కారణంగా పంటలు, ఆస్తులు భారీగా దెబ్బతిన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ ప్రభావం, పంట నష్టం, పునరావాస చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో సీఎం పరిస్థితిని సమీక్షిస్తూ పలు సూచనలు జారీ చేశారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తుఫాన్‌ను ఎలా ఎదుర్కోవాలో ముందుగానే అన్ని విధాలా సిద్ధమయ్యామన్నారు. అవసరమైన ప్రోక్లేన్స్‌ను ముందుగానే సిద్ధం చేసుకున్నామని, NDRF, SDRF బృందాలను, సీనియర్…
Anakapalli: మొంథా తుఫాన్ ప్రభావంతో అనకాపల్లి జిల్లాలో వందల ఎకరాల వరి పొలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. శారదా నది ఉప్పొంగడంతో యలమంచిలి నియోజకవర్గం ఎక్కువగా ప్రభావితమైంది. పంట వెన్ను వేసే సమయంలో శారదా నదికి గండి పడటంతో పంటలను వరద నీరు నిండా ముంచేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ‘మొంథా’ తుఫాన్ బీభత్సం సృష్టిచింది.. తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసాయి. దీంతో వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వరదలతో రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. Read Also: Skywalks: మరో ఆరు స్కై వాక్ లపై దృష్టి పెట్టిన ప్రభుత్వం మొంథా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలం అయ్యింది..…
తెలుగు రాష్ట్రాల్లో ‘మొంథా’ తుఫాన్ బీభత్సం సృష్టిచింది.. తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసాయి. దీంతో వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వరదలతో రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. Read Also:Dimpleplasty: సొట్ట బుగ్గల కోసం ఓ అమ్మాయి.. ఎంత పని చేసిందో తెలుసా.. అయితే వరంగల్ జిల్లా వర్థన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామ శివారులో…
Montha Effect : మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని అనేక జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరంగల్–ఖమ్మం ప్రధాన రహదారి మీదుగా వరద నీరు భారీగా చేరింది. ప్రధాన రహదారిపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఆ రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. వరంగల్ నగరంలోని శివనగర్, మైసయ్య నగర్, ఎన్‌ఎన్ నగర్, లక్ష్మీగణపతి కాలనీ, విశ్వనాథ్ కాలనీ, కాశీబుగ్గ, వివేకానంద కాలనీ, స్టేషన్ రోడ్,…
Telangana : మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సిద్దిపేట, హన్మకొండ, ములుగు జిల్లాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నదులు, వాగులు పొంగిప్రవహిస్తున్నాయి. రహదారులపై నీరు చేరి రాకపోకలు అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్లు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు సంయుక్తంగా సమీక్ష నిర్వహించి, వర్షపాతం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రేపు (గురువారం) సిద్దిపేట, హన్మకొండ, ములుగు…
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని డిండి ప్రాజెక్ట్ వద్ద వరద ఉధృతి పెరిగింది. డిండి ప్రాజెక్ట్‌కు దుందుభి నది నుంచి భారీగా వరద నీరు చేరుతోంది.