Montha Cyclone : మొంథా తుఫాన్ ప్రభావం పెరుగుతోంది. ఖమ్మం-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లో తుఫాన్ కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం తుఫాన్ భద్రాద్రి జిల్లాకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో, ఖమ్మం నగరానికి 110 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది. తుఫాన్ ప్రభావంతో ఈ రెండు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా మున్నేరు నదిలో నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ఇప్పటికే మున్నేరులో నీటి మట్టం 14 అడుగులకు…
మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనకు సీఎం చంద్రబాబు నాయుడు బయల్దేరారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ విజిట్ చేయనున్నారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ విజిట్ చేస్తారు. చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా ఓడలరేవు వరకు విజిట్ చేయనున్నారు. కోనసీమ జిల్లా, అల్లవరం మండలం ఓడలరేవులో సీఎం ల్యాండ్ అవనున్నారు. ఓడల రేవు నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను…
Nara Lokesh: మొంథా తుఫానుపై ఆర్టీజీఎస్ కేంద్రంలో రెండో రోజు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు.. వివిధ జిల్లాల్లో మొంథా తుఫాను తీవ్రత, ఇప్పటివరకు జరిగిన నష్టంపై ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు.. మొంథా తుఫాను వల్ల కలిగిన నష్టంపై ప్రాథమిక అంచనాలు త్వరితగతిన రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై అధికారులను ఆరా తీశారు మంత్రి నారా లోకేష్..
‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని అన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లాలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. తుఫాన్ బీభత్సంతో కృష్ణా జిల్లాలో నిలిచిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి విద్యుత్ శాఖ అధికారులు వర్షంలో కూడా మరమ్మతులు చేపట్టారు. మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, గుడివాడ ప్రాంతాల్లో భారీగా మరమ్మత్తు పనులు చేపట్టారు. జిల్లాలో సుమారు 4 కోట్ల వరకు నష్టం వచ్చినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేస్తామని అధికారులు…
Montha Cyclone: తెలంగాణకు అతి సమీపంలో మొంథా తుఫాన్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.. ఉత్తర వాయువ్య దిశగా తెలంగాణ వైపు తుఫాన్ కదులుతుందని వెల్లడించింది.. మధ్యాహ్నంలోపు ఉమ్మడి ఖమ్మం జిల్లాను తాకనుంది మొంథా.. రాబోయే 6-12 గంటల్లో వాయుగుండంగా లేదా తీవ్ర వాయుగుండంగా మారనుంది. వాయుగుండంగా మారుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం పడుతుంది..
తెలుగు రాష్ట్రాల్లో ‘మొంథా’ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఏపీపై ప్రభావం చూపుతోంది. తుఫాన్ ప్రభావంతో అన్ని జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వరదలతో రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. వరద నీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Montha Cyclone: మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాన్ ప్రభావం రెండో రోజు సైతం రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అనేక రైళ్లు రద్దు చేశారు.మొత్తం 122 రైళ్లు పూర్తిగా రద్దు చేయగా.. 14 రైళ్లు దారి మళ్లించారు. 28 రైళ్లు రీ-షెడ్యూల్ చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. డోర్నకల్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ట్రాక్‌పై భారీగా…
Hyderabad Rains: మొంథా తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్‌లో డతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాలు జలమయం కాగా, మలక్‌పేట్ మెట్రో స్టేషన్ పరిసరాలు పూర్తిగా నీటమునిగాయి. దిల్సుఖ్‌నగర్ నుంచి మలక్‌పేట్ వైపు వెళ్లే ప్రధాన రోడ్డుపై భారీగా నీరు నిల్వ ఉండటంతో వాహనాల రాకపోకలు తీవ్రంగా అంతరాయమయ్యాయి. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ, హైడ్రా టీమ్‌లు అక్కడికి చేరుకుని డ్రైనేజ్ వ్యవస్థను శుభ్రం చేస్తూ నీటిని బయటకు పంపే పనుల్లో నిమగ్నమయ్యాయి. మన్‌హోల్స్ తెరిచి వరద…
ఈ వారం సినీ ప్రేక్షకులకు భారీ వినోదం అందించడానికి సిద్ధమవుతున్న సమయంలో, ‘మొంథా’ తుఫాన్ ప్రభావం పెను శాపంగా మారింది. మాస్ మహారాజా రవితేజ నటించిన సినిమా ‘మాస్ జాతర’ ఈ వారం విడుదల కానుంది. అదే సమయంలో, ‘బాహుబలి’ సినిమాను కూడా రీ-రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే, రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ప్రేక్షకులు థియేటర్ల వరకు రాలేక, సినిమా బుకింగ్స్‌పై తీవ్ర…