Montha Effect : ఆంధ్రప్రదేశ్‌పై విరుచుకుపడిన మొంథా తుఫాన్ భారీ నష్టాన్ని మిగిల్చింది. రాష్ట్రవ్యాప్తంగా పంటలు, ఆస్తులు, మౌలిక సదుపాయాలకు గణనీయమైన నష్టం వాటిల్లినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశంలో తుఫాన్ నష్టంపై ప్రాథమిక అంచనా నివేదికను అధికారులు సమర్పించారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మొంథా తుఫాన్ వల్ల రాష్ట్రానికి మొత్తం రూ.5,265 కోట్ల మేర నష్టం సంభవించినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. అందులో రోడ్లు, భవనాల శాఖకు రూ.2,079 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.829 కోట్ల నష్టం జరిగిందని ఆయన తెలిపారు. నీటిపారుదల శాఖకు సంబంధించి ఈసారి నష్టం తక్కువగా నమోదైందని అని తెలిపారు.
తుఫాన్ కారణంగా ఎటువంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే పశుసంవర్థక రంగంలో కొంత నష్టం నమోదైనట్లు చెప్పారు. “20 పశువులు చనిపోయాయి, రూ.71 లక్షల మేర నష్టం జరిగింది” అని వివరించారు. హార్టికల్చర్, సిరికల్చర్, ఆక్వా రంగాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. హార్టికల్చర్ రంగంలో రూ.39 కోట్ల నష్టం, సిరికల్చర్ రంగంలో రూ.65 కోట్ల నష్టం సంభవించిందన్నారు. ఆక్వా రంగం అత్యధికంగా రూ.1,270 కోట్ల మేర నష్టపోయిందని వివరించారు.
మున్సిపల్ శాఖకు కూడా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిందని సీఎం తెలిపారు. “మున్సిపల్ మౌలిక వసతులకు రూ.109 కోట్ల మేర నష్టం జరిగినట్లు అంచనా వేశాం,” అని చెప్పారు.అంతేకాకుండా.. “తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పునరావాసం, పునర్నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించాం. రైతులు, ప్రజలకు తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నాం,” అని ఆయన తెలిపారు.
Chabahar Port: చాబహార్ పోర్టు ఆంక్షలపై అమెరికా కీలక నిర్ణయం.. భారత్‌కు అతిపెద్ద దౌత్య విజయం..