Montha Cyclone: మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. అనేక జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం.. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హన్మకొండ, హైదరాబాద్, జనగాం, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూలు, నల్గొండ, నారాయణపేట్, రంగారెడ్డి, సిద్దిపేట్, సూర్యాపేట్, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి-భువనగిరి…
‘మొంథా’ తుఫాన్ వరి రైతులను నిండా ముంచేసింది. భారీ వర్షాలకు ఈదురుగాలు తోడవడంతో పంటనష్టం మరింత పెరిగింది. బాపట్ల, వేమూరు, రేపల్లె, తెనాలి ప్రాంతాలలో వేల ఎకరాలలో వరి నేలవాలిపోయింది. కంకుల దశకు వచ్చిన వరి పంట పూర్తిగా నేలకొరిగింది. కంటిన్యూగా వర్షం కురుస్తుంఢంతో పంటపై రైతులు ఆశ వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కళ్ల ముందే పంట నాశనం అవుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని కోరుతున్నారు. తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని…
మొంథా తుఫాన్ తీరం దాటిన అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్ వద్ద సముద్రం అల్లకల్లోలంగా ఉంది. రెండు మీటర్ల ఎత్తులో కెరటాలు ఎగసిపడుతూ లైట్‌హౌస్‌ని తాకుతున్నాయి. రాజోలు ప్రాంతంలో ఉదయం నుంచి భారీ ఈదురు గాలులు వర్షం కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల రోడ్లపై పడిన చెట్లను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తొలగిస్తున్నారు. పల్లిపాలెం గ్రామం జలమయం కావడంతో మత్స్యకార కుటుంబాలు పునరావాస కేంద్రాల్లోనే గడుపుతున్నారు. జిల్లా…
ఏపీ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న ‘మొంథా’ తుఫాన్ బలహీనపడింది. తీవ్ర తుఫాన్.. తుఫాన్‌గా బలహీనపడింది. రానున్న 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తుఫాన్ మచిలీపట్నంకు 50 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయింది. తుఫాన్ ప్రభావంతో నేడు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాంధ్రలో ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. Also Read: Daily Astrology:…
Heavy Rains: హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్ర ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడి, ఈశాన్య దిశగా కదులుతున్న ‘మొంథా’ తుఫాన్ అర్ధరాత్రి తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తీరాన్ని తాకే సమయంలో తుఫాన్ తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ తుఫాన్ ప్రభావం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోంది. హైదరాబాద్ సహా అనేక జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి.
Montha Cyclone: ‘మొంథా’ తుఫాన్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) కేంద్రం నుండి అధికారులతో నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు ఐదుగురు లేదా ఆరుగురు సభ్యులతో కూడిన ప్రభుత్వ బృందాలను తక్షణమే గ్రామాలకే పంపించాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ బృందాలు గ్రామాల్లో అందుబాటులో ఉంటే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.…
వైద్య విద్యార్థిని అత్యాచారం కేసులో ప్రియుడే సూత్రధారి.. పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్‌లో వైద్య విద్యార్థిపై సామూహిక అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న, ఒడిశాకు చెందిన అమ్మాయిపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందిగుడిని ఫిర్దౌస్ షేక్‌గా గుర్తించారు. మరో ఐదుగురిని సహ నిందితులుగా పేర్కొన్నారు. సహ నిందితుల్లో బాధితురాలి ప్రియుడు అయిన సహ విద్యార్థి కూడా ఉండటం గమనార్హం. బాధితురాలి న్యాయవాది…
Weather Updates : హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్ర ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడి, ఈశాన్య దిశగా కదులుతున్న ‘మొంథా’ తుఫాన్ అర్ధరాత్రి తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తీరాన్ని తాకే సమయంలో తుఫాన్ తీవ్ర ప్రభావం చూపనున్నట్లు, ప్రత్యేకించి ఏపీతో పాటు.. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది. Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ తొక్కలతో.. పెరుగును మరింత పోషకమైనదిగా చేసిన బిహెచ్‌యు శాస్త్రవేత్త ఉమ్మడి…
Montha Cyclone Effect: అందిన సమాచారం మేరకు ‘మొంథా’ తుఫాన్ దిశను మార్చుకున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం దగ్గర తీరం దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరో 3-4 గంటలు అత్యంత కీలకం కానుంది. తుఫాను తీరాన్ని దాటడానికి మరో 6 గంటలు పట్టే ఛాన్స్ ఉంది. ఈదురు గాలులతో కలిపి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ‘మొంథా’ తుఫాను ల్యాండ్ ఫాల్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. Movie…