తెలుగు రాష్ట్రాల్లో ‘మొంథా’ తుఫాన్ బీభత్సం సృష్టిచింది.. తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసాయి. దీంతో వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వరదలతో రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Read Also:Dimpleplasty: సొట్ట బుగ్గల కోసం ఓ అమ్మాయి.. ఎంత పని చేసిందో తెలుసా..
అయితే వరంగల్ జిల్లా వర్థన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామ శివారులో వరద నీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. గ్రామ ఎల్లమ్మ చెరువు నిండి మత్తడి పోయడంతో ఉప్పరపల్లి గ్రామానికి వెళ్లే రహదారిపై నుంచి నీరు ప్రవహిస్తోంది. హన్మకొండ డిపోకు చెందిన బస్సు నల్లబెల్లి నుంచి ఉదయం వరంగల్ వెళ్తుండగా రోడ్డు కయ్యకోసి బస్సు టైరు దిగబడింది. 15 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
Read Also:Pea Nuts: వేరు శెనగ తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు తెలుసా..
ఇదిలా ఉండగా.. మొంథా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలం అయ్యింది.. కొన్ని గంటల పాటు కనివిని ఎరుగని స్థాయిలో భారీ వర్షం కురిసింది. దాదాపు 42.2 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. దీంతో చెరువులు కుంటలు తెగి.. వరద నీరు అంతా ఇళ్లలోకి చేరింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి. అర్థరాత్రి వర్షం తగ్గడంతో.. మళ్లీ వరంగల్ నుంచి రాకపోకలు మొదలయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.
