Montha Effect : తెలంగాణలో అక్కడ నిలిచిన రాకపోకలు.. ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్
- మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో కుండపోత వర్షాలు
- వరంగల్ నగర వీధుల్లో వరద నీరు, రవాణా అంతరాయం
- ఆరు జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్
- ఖమ్మం-మహబూబాబాద్ రహదారి తాత్కాలికంగా మూసివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Montha Effect : మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని అనేక జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరంగల్–ఖమ్మం ప్రధాన రహదారి మీదుగా వరద నీరు భారీగా చేరింది. ప్రధాన రహదారిపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఆ రహదారిని తాత్కాలికంగా మూసివేశారు.
వరంగల్ నగరంలోని శివనగర్, మైసయ్య నగర్, ఎన్‌ఎన్ నగర్, లక్ష్మీగణపతి కాలనీ, విశ్వనాథ్ కాలనీ, కాశీబుగ్గ, వివేకానంద కాలనీ, స్టేషన్ రోడ్, బట్టలబజార్ ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది. రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద భారీగా నీరు నిలిచిపోవడంతో వాహన రాకపోకలు కష్టంగా మారాయి. ముఖ్యంగా శివనగర్ ప్రాంతంలో రహదారిపై నీరు నిలిచి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరంగల్ బస్టాండ్ పరిసరాలు చెరువును తలపించే స్థితికి చేరాయి.
Also Read
భారీ వర్షాల నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కోసం ప్రజలు 79819 75495 నంబర్ ద్వారా సంప్రదించాలని అధికారులు సూచించారు. వరంగల్ జిల్లాలోని కల్లెడ్ ప్రాంతంలో అత్యధికంగా 34 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదనంగా, ఆదిలాబాద్, నిర్మల్, సూర్యాపేట, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు ప్రకటించబడ్డాయి.
ఖమ్మం–మహబూబాబాద్ జిల్లాల మధ్య ఉన్న వాల్యాతండా సమీప వంతెన వద్ద ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద తీవ్రత పెరగడంతో అధికారులు రెండు జిల్లాల మధ్య రాకపోకలను సాయంత్రం నుంచి నిలిపివేశారు. ప్రస్తుతం పలు జిల్లాల్లో వరద పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరం లేని ప్రయాణాలను నివారించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?