వేడితో సతమతున్న జనాలకు తొలకరి చినుకులు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి…వర్షపు చినుకులు మనకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. అయితే, ఈ కాలంలో అలెర్జీలు, ఇన్ఫెక్షన్లు, వ్యాధులు ఎక్కువగానే ఇబ్బందిపెడుతూ ఉంటాయి. వర్షాకాలంలోపుప్పొడి, ధూళి, కారణంగా అర్జీలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి..ఆస్తమా, సైనస్ సమస్యలు ఉన్నవారి పరిస్థితి తీవ్రం అవుతుంది. తేమ వాతావరణంలో బ్యాక్టీరియా, వైరస్ కూడా త్వరగా వృద్ధి చెందుతాయి. ఈ సీజన్‌లో అలెర్జీలు, వ్యాధికారక క్రిముల నుంచి మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవడానికి, రోగనిరోధక శక్తిని…
నైరుతి రుతుపవనాలు ఢిల్లీ, ముంబై నగరాలను చేరాయి. రుతుపవనాల రాకతో రెండు నగరాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల కారణంగా దేశ రాజధాని, దేశ ఆర్థిక రాజధానిలో ఒకేసారి వర్షాలు కురవడం 62 ఏళ్లలో ఇదే తొలిసారి.
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలకు ఇప్పుడు ఊరట లభించనుంది. భారత వాతావరణ కేంద్రం ప్రకారం, రుతుపవనాలు దేశ రాజధాని ఢిల్లీ, యూపీ, బీహార్‌తో సహా పలు రాష్ట్రాల్లోకి త్వరలో ప్రవేశించనున్నాయి.
వర్షాకాలం ప్రారంభమైంది. ఇప్పుడు ఇక సీజనల్ వ్యాధులతోపాటు.. ఒకేసారి వాతావరణంలో మార్పులు రావడంతో శరీరం వాటికి అనుగుణంగా ఒకేసారి మారడంలో ఇబ్బంది పడుతుంది.
తెలంగాణకు రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఉక్కపోతతో విసిగిపోతున్నారు. అయితే.. తాజాగా రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.
ఈ నెల 18–21 మధ్య రుతుపవనాలు విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని.. 19వ తేదీ నుంచి రాయలసీమలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. క్రమంగా కోస్తాంధ్రలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.
రుతుపవనాల ఎంట్రీతో కేరళ తీరంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అలప్పుజా, ఎర్నాకుళం ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం లక్షద్వీప్, కేరళ ప్రాంతాలకు విస్తరించిన రుతుపువనాలు 48 గంటల్లో కేరళలోని అన్ని ప్రాంతాలకు, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని ఐఎండీ పేర్కొంది. మరో వారం-10 రోజుల్లో తెలంగాణలోకి విస్తరించే అవకాశం ఉంది.
Monsoon: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ఆగనమనం ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా జూన్ మొదటివారంలోనే రుతుపవానాలు కేరళ తీరాన్ని తాకాలి. అయితే ఇప్పటి వరకు కేరళను చేరుకోలేదు. జూన్ 4న రెండు రోజులు ఆలస్యంగా కేరళలోకి నైరుతి రుతుపవనాలు వస్తాయని ముందుగా భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) అంచనా వేసింది. అయితే అరేబియా సముద్రంలో ‘బిపోర్జాయ్’ తుఫాన్ ఏర్పడటంతో నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Hot Weather: ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు వర్షాలు, మరోవైపు అధిక ఉష్ణోగ్రతలు ప్రజలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.. రేపు రాష్ట్రంలో తీవ్ర వడగాల్పులు విరుచుకుపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.. రేపు 12 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 218 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 31 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 260 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా వరదరాజపురంలో 43.3, ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో 44.9, ఏన్టీఆర్ జిల్లా తిరువూరులో 44.7, అల్లూరి…