Heavy Rains: ఉత్తర భారతదేశంలో రుతుపవనాలు బీభత్సం సృష్టించాయి. యమునా, దాని ఉపనదులు వర్షాలకు ఉప్పొంగుతున్నాయి. నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 19 మంది ప్రాణాలు కోల్పోయారు.
Delhi Rains: ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా దేశరాజధాని ఢిల్లీలో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఢిల్లీలోని సప్దర్ జంగ్ ప్రాంతంలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1982 జూలై 25 తర్వాత 41 ఏళ్లకు భారీ వర్షం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
El Nino:వాతావరణ నిపుణులు అంచనా వేసినట్లుగానే పసిఫిక్ మహాసముద్రంలో ‘ఎల్ నినో’ ఏర్పడింది. ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో ఏర్పడినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించింది. దీని ప్రభావం వల్ల అనేక దేశాల్లో ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి.
వర్షాకాలంలో మారుతున్న వాతావరణం వల్ల రోగనిరోధక శక్తి బలహీనంగా మారుతుంది. దీంతో అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. భారీ వర్షాలు కురిసే సమయంలో ఆహారం, పానీయాల విషయంలో చిన్నపిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం.
IMD: ఈ ఏడాది జూన్ నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ సంస్థ( ఐఎండీ ) తెలియజేసింది. గత 122 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది జూన్ నెలలో దక్షిణాదిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. సగటు ఉష్ణోగ్రతను మించి ఈ దక్షిణ
Monsoon Hair Care Tips For Men: వర్షాకాలంలో జుట్టు రాలడం సర్వసాధారణం. వెంట్రుకలు సరిగా ఆరకపోతే.. స్కాల్ప్‌లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో వర్షం కారణంగా జుట్టు పొడిగా ఉంటుంది. దానివల్ల చుండ్రు సమస్యలు ప్రారంభం అవుతాయి. వర్షాకాలంలో స్త్రీలతో పాటు పురుషులకు కూడా జుట్టు సమస్యలు వస్తాయి. ఏ నేపథ్యంలో మగవారు కూడా జుట్టు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో పురుషులు తమ జుట్టును ఎలా సంరక్షించుకోవాలో ఓసారి చూద్దాం. తేలికపాటి…
వర్షాకాలంలో ఆరోగ్యం, చర్మమే కాదు జుట్టు వల్ల సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా జుట్టు రాలడం వంటి సమస్యలు జనాలను చాలా ఇబ్బందిపెడుతుంది. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో జుట్టు చాలా రాలడం జరుగుతుందని కొందరు అంటారు. అయితే వర్ష కాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వలన జుట్టు రాలుతుందని నిపుణులు చెబుతున్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పెనుప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ప్రతికూల వాతావరణం కారణంగా ఉత్తర బెంగాల్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడింది.
దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. మంగళ, బుధవారాల్లో 24 గంటల వ్యవధిలో 115.5 మిల్లీమీటర్లకు మించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది.