Monsoon Care: వర్షాకాలం ప్రారంభమైంది. ఇప్పుడు ఇక సీజనల్ వ్యాధులతోపాటు.. ఒకేసారి వాతావరణంలో మార్పులు రావడంతో శరీరం వాటికి అనుగుణంగా ఒకేసారి మారడంలో ఇబ్బంది పడుతుంది. ఈ క్రమంలో సీజనల్ వ్యాధులు రావడంతోపాటు అలర్జీలు సైతం వాటి ప్రభావాన్ని చూపుతాయి. ప్రకృతి మార్పుకు అనుగుణంగా మనం సైతం మన ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటూ.. ఆహారంలో వ్యాధి నిరోధక ఆహార పదార్థాలను తీసుకోవల్సి ఉంటుంది.
Read also: Asian Games 2023 BCCI: బీసీసీఐ యూటర్న్.. ఏషియన్ గేమ్స్ 2023లో భారత క్రికెట్ జట్లు!
వర్షాకాలం ప్రారంభం కావడంతో.. అక్కడక్కడా వర్షాలు కూడా పడుతున్నాయి. వాతావరణం చల్లబడి.. మండే ఎండల నుంచి విముక్తి లభించింది. వర్షాకాలంలో ప్రకృతి.. వర్షపు చినుకులు మనకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. అయితే, ఈ కాలంలో అలెర్జీలు, ఇన్ఫెక్షన్లు, వ్యాధులు ఎక్కువగానే ఇబ్బందిపెడుతూ ఉంటాయి. వర్షాకాలంలోపుప్పొడి, ధూళి, కారణంగా అర్జీలను ట్రిగ్గర్ చేస్తుంది. ఈ కాలంలో ఆస్తమా, సైనస్ సమస్యలు ఉన్నవారి పరిస్థితి తీవ్రం అవుతుంది. తేమ వాతావరణంలో బ్యాక్టీరియా, వైరస్ కూడా త్వరగా వృద్ధి చెందుతాయి. ఈ సీజన్‌లో అలెర్జీలు, వ్యాధికారక క్రిముల నుంచి మనల్ని మనం సురక్షితంగా ఉంచుకుంటూ.. రోగనిరోధక శక్తిని మెరుగుపరచుకోవడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం..
Read also: NTR: దుబాయ్ కి వెళ్లిన దేవర…
అల్లంలో యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరంలో వాపు ప్రక్రియను తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. నాసికా మార్గం, గొంతులో చికాకు కలిగించే.. అలెర్జీలతో బాధపడుతుంటే.. అల్లం ఎంతగానో సహాయపడుతుంది. అల్లంలోని యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ యాంటీఆక్సిడేటివ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు.. అలెర్జీ లక్షణాలను తగ్గిస్తాయి. ఈ సీజన్‌లో వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి.. అల్లం టీ తాగితే మంచిది. మీ వంటల్లోనూ అల్లం ఎక్కువగా ఉపయోగించుకుంటే మంచింది. సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇది ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. మీరు తీసుకునే ఆహారంలో ఆరెంజ్, నిమ్మ, బత్తాయి, యాపిల్ వంటి పండ్లు తీసుకుంటే.. విటమిన్ సి సమృద్ధిగా అందుతుంది.
Read also: Mumbai Rains: ముంబైలో భారీ వర్షం .. ఎల్లో అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ వంటి వివిధ ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. పసుపులోని కర్కుమిన్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది. దగ్గు, జలుబు, గొంతునొప్పి లాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు పాలలో పసుపు వేసుకుని తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. పసుపులో ఉండే కర్‌క్యుమిన్ శరీరంలో వైరస్ వృద్ధిని అరికడుతుంది. వర్షాకాలం వంటల్లో తప్పకుండా పసుపును ఉపయోగించాలి. ఉల్లిపాయల్లో క్వెర్సెటిన్ అనే బయోఫ్లేవనాయిడ్ ఉంటుంది, ఇది యాంటిహిస్టామైన్‌గా పనిచేస్తుంది. మీరు అలెర్జీలతో బాధపడుతుంటే.. యాంటిహిస్టామైన్లు సహాయపడతాయి. దీనిలో యాంటీఆక్సిడేటివ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. ఉల్లిపాయలో ప్రీబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణాశయానికి మేలు చేస్తాయి. టొమాటోలో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వీటిలో లైకోపీన్ ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. శరీరంలో వాపులను నివారించడానికి అరెర్జీలను తగ్గించడానికి తోడ్పుడుతుంది. కాబట్టి వర్షకాలం ముగిసే వరకు మీ ఆహారంలో వీటిని తీసుకొని రోగనిరోధక శక్తిని పెంచుకొని రోగాలకు దూరంగా ఉండండి.