చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం ముద్దిగుప్పం పంచాయతీలో జగనన్న స్వేచ్ఛ ఆరోగ్య కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పాల్గొన్నారు. త్వరలో ఏపీలో ఎన్నికల నేపథ్యంలో నారాయణస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తాను డబ్బులు ఇచ్చి ఓటు అడగని వ్యక్తిని అని అన్నారు. అంతేకాకుండా.. ఎలక్షన్ లో నిలబడి ఎవరి దగ్గర తాను ఒక రూపాయి తీసుకోలేదని చెప్పారు. ఏ పోస్టు అడిగిన తాను ఫ్రీగా చేశానన్నారు. కాంట్రాక్టర్ల దగ్గర తాను డబ్బు తీసుకోలేదని…
ఈరోజు దీపావళి ముహూర్తం ట్రేడింగ్ సందర్భంగా స్టాక్ మార్కెట్‌లో అద్భుతమైన ప్రారంభం కనిపించింది. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైంది. ఆ తర్వాత బీఎస్‌ఈ ప్రధాన సూచీ 65,418.98 పాయింట్లకు చేరుకుంది. దీని వల్ల ఇన్వెస్టర్లు రూ. 3 లక్షల కోట్లకు పైగా ఆర్జించారు. అయితే మార్కెట్ ప్రారంభమైన 6 నిమిషాల్లోనే 345.26 పాయింట్ల లాభంతో 65,235.78 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో టాప్ 30 షేర్లు గ్రీన్ మార్క్‌లో ట్రేడవుతున్నాయి.
భుత్వ పదవులు ఇప్పిస్తానంటూ కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిందితుడు విశ్వతేజగా పోలీసులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ బంగారపు షాపు యజమాని దగ్గర, రాజ్యసభ సీటు ఇప్పిస్తానని చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌గఢ్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ బ్యాంకులో మంగళవారం తెల్లవారుజామున భారీ దోపిడీ జరిగింది. ఉదయం బ్యాంకు తెరిచిన తర్వాత కొందరు దుండగులు హఠాత్తుగా బ్యాంకులోకి ప్రవేశించారు. తొలుత బ్యాంకు మేనేజర్‌ను కత్తితో పొడిచిన దుండగులు.. మిగిలిన బ్యాంకు ఉద్యోగులను బందీలుగా చేసుకుని నగదు, బంగారం, వెండితో పరారయ్యారు.
దానం అనేది మనిషి చెయ్యగలిగే గొప్ప పని.. దానం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. అయితే అన్ని రకాల దానధర్మాలు నిజంగా సమానమైన శుభ ఫలితాలను ఇస్తాయా? కొన్ని విరాళాలు పెద్ద విరాళాలుగా పరిగణిస్తారు, అయితే కొన్ని వస్తువులను ఎప్పుడూ విరాళంగా ఇవ్వకూడదని సలహా ఇస్తారు..దానధర్మం గ్రహ సంబంధమైన బాధల నుండి ఉపశమనం పొందడమే కాకుండా వివిధ పాపాల నుండి విముక్తులను చేస్తుంది. జీవితంలోని వివిధ సమస్యలను పరిష్కరించడానికి వివిధ రకాల దానధర్మాలు గ్రంథాలలో పేర్కొనబడ్డాయి. ప్రత్యేక…
శ్రావణమాసంలో మహిళలు వరలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.. దేశంలోని పలు ఆలయాల్లో అమ్మవార్లను ప్రత్యేకంగా పూజిస్తారు.. ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తారు.. ఒక్కో ఆలయంలో ఓ విధంగా అమ్మవారిని అలంకరించి ప్రత్యేకతను చాటుకుంటాడు.. ఇక ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని ఓ అమ్మవారిని ఏకంగా నోట్లతో అలంకరించారు.. అందుకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక శ్రీ…
పరీక్షలకు హాజరైన ఓ విద్యార్థి.. ఎంత ఘోరానికి తెగించాడంటే ఈ విషయం వింటే మీరు ఆశ్చర్యపోతారు. పరీక్షలు రాస్తుండగా.. సరిగా రాయలేకపోవడంతో ఆన్సర్ షీట్లలో డబ్బులు పెట్టాడు ఓ విద్యార్థి.
ప్రేమకు డబ్బుతో సంబంధం ఉండదు. ప్రేమలో పడితే ఆస్తి, అంతస్తులాంటివి ఏవీ గుర్తురావు. ప్రేమ కోసం కోట్లు వదులుకున్నట్లు సినిమాల్లో చూస్తూ ఉంటాం. బ్రిటన్ రాకుమారులు కూడా ప్రేమ కోసం రాచరికాన్ని వదులుకున్న ఘటనలు చూశాం. మన తెలుగులో సూపర్ హిట్ అయిన మల్లీశ్వరి సినిమాలో కూడా హీరోయిన్ హీరో ప్రేమ కోసం కోట్ల ఆస్తిని వదులుకుంటుంది. అలాంటి సీన్లు సినిమాలో తప్ప బయట చూడలేం అని చాలా మందికి అనుకుంటూ ఉంటారు. కానీ అలాగే ఓ…
నేటి తరం యువత మంచి చెడులకు తేడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రేమలు, పెళ్లిళ్లు అంటూ కన్నవాళ్లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు వయసుతో సంబంధం లేకుండా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లను వాడుతున్నారు.