Beggar Having Huge amount of money : ఓ బిచ్చగాడి జేబులో రూ.5 లక్షలకు పైగా నగదు దొరికిన షాకింగ్ ఘటన పాకిస్థాన్ లో వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధ బిచ్చగాడు అపస్మారక స్థితిలో రోడ్డుపై పడి ఉండగా.. అతడిని రక్షించే సమయంలో ఆసుపత్రికి తీసుకువెళుతుండగా.. అతని జేబులో భారీగా డబ్బు కనిపించింది. పాకిస్థాన్ మీడియా నివేదిక ప్రకారం.., పంజాబ్ ప్రావిన్స్ లోని సర్గోధా జిల్లాలోని ఖుషబ్ రోడ్‌లో బిచ్చగాడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు.…
వ్యవసాయ శాఖ అధికారులు తమ చేతివాటం చూయించారు. రైతుల ఖాతాల్లో జమకావాల్సిన పంట నష్టం సొమ్మును దారిమళ్లించారు. నకిలీ ఖాతాల్లో జమ చేసుకుని కాజేశారు. ఈ విషయం కాస్త రైతులకు తెలియడంతో ఆందోళనకు దిగారు. ఈ ఉదాంతం కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.
ఓ నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తానని ఒకరి నుంచి నాలుగు లక్షల రూపాయలను వసూలు చేశాడు ఓ ఘనుడు. సంవత్సరాలు గడుస్తున్న ఉద్యోగం ఇప్పించుకోవడంతో తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అతడిపై బాధితుడు ఒత్తిడిని పెంచాడు. అప్పుడు ఇప్పుడు అంటూ మాట తిప్పేస్తున్నాడంతో విసిగిపోయిన బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి భార్యను కిడ్నాప్ చేసిన రాజ్యాంగ వెలుగులోకి వచ్చింది. తమ దగ్గర ఉద్యోగం కోసం తీసుకున్న డబ్బులు ఇస్తేనే తన భార్యని వదులుతామని వారు హెచ్చరించారు. ఈ…
ఏపీలో సోమవారం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగబోతుంది. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలతో పాటు.. 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో.. ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఎన్నికల ముందు.. ఓటర్లకు ప్రలోభాలు కొనసాగుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా.. డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈసీ ఎన్ని పకడ్బంధీ చర్యలు చేపట్టినప్పటికీ డబ్బులు, మధ్యం పంపిణీ జరుగుతుంది. అంతేకాకుండా.. డబ్బుల పంపిణీ విషయంలో కొన్ని చోట్ల ఘర్షణలు తలెత్తుతున్నాయి.
ప్రస్తుతం రోజులు మారాయి. ఇదివరకు రోజుల్లో మనకు డబ్బు అవసరం అయితే బ్యాంకుకు వెళ్లి గంటలు తరబడి లైన్లో వేచి ఉండి అనేక రకాల ఫార్మ్స్ రాసి బ్యాంకు ఉద్యోగి ఇస్తే అప్పుడు డబ్బు చేతిలోకి అందుతుంది. ఇదంతా పాత పద్ధతి. ఇప్పుడు ఏటీఎంస్ ద్వారా బ్యాంకులో వద్ద క్యూలలో నిలబడకుండా అది తక్కువ సమయంలో డబ్బులు పొందటానికి వీలు కలుగుతుంది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఆన్లైన్ ఆధార్ సేవను వినియోగించడం ద్వారా నేరుగా…
ఏపీలో కరెన్సీ నోట్లకు రెక్కలొచ్చాయి. ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం ఉండటంతో పార్టీలు, అభ్యర్థులు స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో.. ఓటర్లను ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నారు. ఇన్నాళ్లు కలుగుల్లో దాచిపెట్టిన డబ్బులను బయటకు తీస్తున్నారు. బినామీల చేతుల మీదుగా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. అక్కడక్కడ తనిఖీల్లో దొరికిందే కొంత.. ఇంకా దొరకని సొమ్ము వందల కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎన్నికల్లో నగదు ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల కమిషన్ కూడా కొరడా ఝులిపిస్తుంది.
విశాఖలో ఓ ప్రేమజంట నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టింది. పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్స్ అంటూ నిరుద్యోగులను నమ్మించి వారి దగ్గరి నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. నకిలీ పోలీస్ అవతారమెత్తి.. తాము పోలీసులమంటూ నమ్మబలికారు. దీంతో పోలీస్ శాఖలో ఉద్యోగాలు అనగానే.. నిరుద్యోగులు వారికి భారీ ఎత్తున ముట్టజెప్పారు. ఇదే అదునుగా భావించిన నకిలీ పోలీసులు 30 మంది నుంచి రూ.3 కోట్లు వసూలు చేసింది.
అధిక లాభాలు ఆశ చూపి.. ట్రేడింగ్ పేరుతో కోట్లు కొట్టేస్తున్నారు సైబర్ కేటగాళ్లు. ట్రేడింగ్ పేరుతో లాభాలు చూపెడతామని అమాయకుల దగ్గర నుంచి కోట్లు వసూలు చేసి చివరకు టోపీ తిప్పేస్తున్నారు. చార్టెడ్ అకౌంటెంట్, న్యాయవాదులే టార్గెట్ గా సైబర్ కేటుగాళ్లు పనిచేస్తున్నారు. పెద్ద ఎత్తున ట్రేడింగ్ చేసే న్యాయవాదులు, చార్టెడ్ అకౌంట్ లో సైబర్ కేటుగాళ్లు ట్రాప్ చేస్తున్నారు. ట్రేడింగ్ లో అధిక లాభాలు ఇప్పిస్తామని చెప్పి వారిని బుట్టలోకి దించుతున్నారు ఈ మాయగాళ్లు. దీంతో…
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి అధికారం దక్కించుకునేందుకు కలలు కంటున్నారు. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ఊబలాటపడుతున్నారు.
Ayodhya: గత వారం ఎంతో ఘనంగా అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది. దేశ నలుమూలల నుంచి వచ్చేసిన అతిరథమహారధుల మధ్య అయోధ్య రామాలయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇప్పుడు లక్షలాది మంది ప్రతిరోజు అయోధ్యను సందర్శిస్తున్నారు. భక్తుల తాకిడి పెరగడంతో రకరకాల దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఏర్పడ్డాయి. అలాగే అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో కూడా మరికొన్ని ఏర్పడ్డాయి. అయితే ఓ రెస్టారెంట్ నిర్వాహకుడి చేసిన కక్కుర్తిపని వల్ల ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.…