ప్రేమకు డబ్బుతో సంబంధం ఉండదు. ప్రేమలో పడితే ఆస్తి, అంతస్తులాంటివి ఏవీ గుర్తురావు. ప్రేమ కోసం కోట్లు వదులుకున్నట్లు సినిమాల్లో చూస్తూ ఉంటాం. బ్రిటన్ రాకుమారులు కూడా ప్రేమ కోసం రాచరికాన్ని వదులుకున్న ఘటనలు చూశాం. మన తెలుగులో సూపర్ హిట్ అయిన మల్లీశ్వరి సినిమాలో కూడా హీరోయిన్ హీరో ప్రేమ కోసం కోట్ల ఆస్తిని వదులుకుంటుంది. అలాంటి సీన్లు సినిమాలో తప్ప బయట చూడలేం అని చాలా మందికి అనుకుంటూ ఉంటారు. కానీ అలాగే ఓ అమ్మాయి తాను ప్రేమించిన అబ్బాయి కోసం కోట్ల ఆస్తిని వదిలేసుకుంది. అయితే ఇది జరిగింది ఇండియాలో మాత్రం కాదు.
మలేషియాకు చెందిన ఓ యువతి ప్రియుడి కోసం తనకు వారసత్వంగా వచ్చే వేల కోట్లను వదులుకుంది. వివరాల్లోకి వెళ్తే… మలేషియాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఖుకే పెంగ్, మాజీ మిస్ మలేషియా పౌలిన్ ఛాయా దంపతుల కుమార్తె ఏంజెలిన్. ఏంజెలిన్ పై చదువుల కోసం ఆక్స్‌ఫర్డ్ యేూనివర్సిటీకి వెళ్లింది. ఆ సమయంలో ఏంజెలిన్ కు జెడిడియా అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఏంజెలిన్ తన తల్లిదండ్రులకు చెప్పింది.
Also Read: ప్రపంచంలోనే అతి తక్కువ విడాకులు తీసుకున్న దేశం ఏదో తెలుసా..?
తరువాత తెలిసిందేగా కామన్ డైలాగ్, నో… ఈ పెళ్లి మాకు ఇష్టం లేదు. నువ్వు అతన్ని కనుక పెళ్లి చేసుకుంటే మా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదనేశారు ఏంజెల్ అమ్మానాన్నా. నాకు మీ ఆస్తిలో పైసా కూడా అవసరం లేదు, నేను ప్రేమించిన జెడిడియాతోనే నా జీవితం అంటూ ఏంజెల్ సుమారు రూ.2,484 కోట్ల ఆస్తిని వదులుకుని ప్రియుడి వద్దకు వెళ్లి, 2008 లో పెళ్లి చేసుకుంది.
ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని చూసిన ప్రతి ఒక్కరు ఏంజెల్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. స్వార్థపూరిత ప్రేమలు ఉన్న ఈరోజుల్లో ప్రియుడి కోసం అంతటి ఆస్తిని వదులుకోవడం మామూలు విషయం కాదంటూ వారిద్దరూ ఇలాగే సంతోషంగా ఉండాలంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.