హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రలోభాల పర్వంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది.. అక్కడ అంత డబ్బు పంచుతున్నారాట.. ఈ బ్రాండ్ లిక్కర్ ఇస్తున్నారట అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఇక, ఈ ఎన్నికలపై బెట్టింగ్‌లు కూడా నడుస్తున్నాయట.. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికల వ్యవహారం ఇప్పుడు మానవ హక్కుల కమిషన్‌కు చేరింది.. డబ్బులు, మద్యం పంపిణీపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారం నేటితో ముగియగా.. రాజకీయ పార్టీల అభ్యర్థులు…
తెలంగాణ ప్రజలు మొత్తం హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలను ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.. ఇప్పటికే ప్రచార పర్వానికి తెరపడగా.. ప్రలోభాలకు తెరలేపారు.. వాస్తవానికి హుజురాబాద్‌లో గత రెండు మూడు రోజులుగా డబ్బుల పంపిణీ జరుగుతుందనే ప్రచారం సాగుతోంది. అయితే, ఇప్పుడు తమకు డబ్బులు ఇవ్వలేదంటూ ఓటర్లు ఏకంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగడం హాట్‌టాపిక్‌గా మారిపోయింది.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని రాంపూర్‌లో ఓ పార్టీకి చెందిన నేతలు.. కొంతమంది ఓటర్లకే డబ్బులు పంచారట.. మరికొంత మందికి మరిచారో…
1498లో వాస్కోడిగామా యూరప్ నుంచి భారత్‌కు సముద్ర మార్గాన్ని కనిపెట్టిన తరువాత భారత దేశంతో యూరప్ దేశాల నుంచి వాణిజ్యం మొదలైంది. ఇలా 1600 సంవత్సరంలో భారత్‌లో ఇంగ్లాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించింది. ఇంగ్లాండ్ కు చెందిన సర్ థామస్ మూడేళ్లు కష్టపడి ఇండియాలో ఈస్ ఇండియా కంపెనీ ఏర్పాటుకు అనుమతులు తెచ్చుకున్నాడు. ఇలా ఇండియాలోకి అడుగుపెట్టిన బ్రిటీషర్లు వేగంగా ఫ్యాక్టరీలు స్థాపించి వ్యాపారం మొదలుపెట్టారు. క్రమంగా దేశంలో బలాన్ని పెంచుకున్నారు. 50 ఏండ్ల కాలంలో…
వీళ్లు మామూలు దొంగల కాదు.. ఎందుకంటే ఏకంగా డిప్యూటీ కలెక్టర్ ఇంటికే కన్నం వేశారు.. ఉన్నకాడికి ఊడ్చేశారు.. అయినా వారికి ఏదో వెలితి అనిపించినట్టుంది… ఎందుకంటే.. దొంగతనం చేసింది డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో.. దొరికిన నగదు చాలా తక్కువ అని ఫీలయ్యారేమో.. అక్కడ ఓ లేఖను వదిలివెళ్లారు.. ఆ తర్వాత ఆ లేఖ చూసిన డిప్యూటీ కలెక్టర్ షాక్ తిని.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరరిగింది.. ఆ ఘటకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి…
కరోనా కాలంలో అనేక మంది తమ విలువైన ఉద్యోగాలను కోల్పోయారు. చాలామంది రోడ్డున పడ్డారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇంకా విడిచిపెట్టలేదు. కొత్త కొత్త వేరియంట్లతో ఇబ్బందులు పెడుతూనే ఉన్నది. కరోనా కాలంలో ఎయిర్ లైన్స్ సంస్థలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాకపోకలు లేకపోవడంతో పైలెట్‌లను తొలగించింది. అలా ఉద్యోగాలు కోల్పోయిన వారిలో యూకేకు చెందిన ఎరోల్ లెవెంథల్ కూడా ఒకరు. ఈయన ఉద్యోగం కోల్పోయిన తరువాత, పైలెట్ కాకముందు ఉన్న అనుభవంతో తిరిగి లారీ డ్రైవర్‌గా…
సకాలంలో వర్షాలు కురవకపోవడం వలన పంటను పండించలేరు. అదే విధంగా భారీ వర్షాలు వరదల కారణంగా కూడా పంటకు నష్టం వస్తుంది. ప్రకృతి విపత్తుల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇస్తుంది. ఈ పరిహారం కోసం రైతులు కాళ్లు అరిగేలా అధికారుల చుట్టూ తిరగాలి. డబ్బులు చెల్లించాలి. వచ్చిన మొత్తంలో కొంత సమర్పిస్తేనే పనులు ముందుకు సాగుతాయి. అయితే, హర్యానాలో ఓ రైతుకు వింత సమస్య వచ్చిపడింది. తనకు 20 ఎకరాల పంటపోలం ఉన్నది.…
డబ్బుల కోసం ఓ కొడుకు దారుణానికి ఒడిగట్టాడు. కన్నతల్లి అని చూడకుండా ఆమెపై దాడిచేశాడు. తీవ్రంగా గాయపరిచాడు. ఈ సంఘటన తమిళనాడులోని నమ్మక్కల్ జిల్లాలో చోటుచేసుకుంది. నమ్మక్కల్ జిల్లాలోని పొన్నేరిపట్టిలో నివశించే షణ్ముగం అనే వ్యక్తి డబ్బుల కోసం తల్లిపై దాడి చేశాడు. రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లి దారుణంగా కొట్టాడు. ఈ దాడిలో ఆమెకు తీవ్రమైన గాయాలయ్యాయి. గతంలో ఆ తల్లి కుమారుడికి తన పొలం రాసిచ్చింది. అయితే, ఇప్పుడు పొదుపు స్కీంలో దాచుకున్న రూ.3 లక్షలు…
ఇళ్లలో పేపర్లు కనిపిస్తే చాలు ఎలుకలు నుజ్జు నుజ్జు చేసిన ఘటనలు ఎన్నో చూసి ఉంటారు.. కానీ, ఓ వృద్ధుడు తన ఆపరేషన్ కోసం కష్టపడి సంపాదించి కొంత… అప్పు తెచ్చి మరికొంత.. ఇంట్లో దాచుకున్నాడు.. కానీ, ఆ మొత్తం సొమ్మును ఎలుకలు నుజ్జు..నుజ్జు చేయడంతో లబోదిబోమనడం బాధితిడి వంతు అయ్యింది… మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం వేంనూర్ శివారు ఇందిరానగర్ తండాలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇందిరానగర్ తండాకు చెందిన…
ప్రపంచాన్ని కరోనా ఎంతటా ఇబ్బందులకు గురి చేసిందో చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా నుంచి బయటపడాలి అంటే తప్పని సరిగా మాస్క్ ధరించాలి, రెండోది వ్యాక్సినేషన్ తీసుకోవాలి. అమెరికాలో ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. వ్యాక్సినేషన్ జరుగుతుండటంతో ఆ దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది. మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. కానీ, కరోనాకు భయపడి ఇంకా ప్రజలు మాస్క్ ధరిస్తూనే ఉన్నారు. దీంతో క్యాలిఫోర్నియాకు చెందిన ఫిడిల్ హెడ్ కేఫ్…
విశాఖలో అంబులెన్స్ డ్రైవర్స్ రెచ్చిపోతున్నారు. అందినకాడికి అందినట్లు ప్రైవేట్ అంబులెన్సు డ్రైవర్స్ దోచుకుంటున్నారు. దాంతో అంబులెన్సు డ్రైవర్ ల ఆగడాలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగ్గారు ట్రాన్స్పోర్ట్ అధికారులు. నగరంలో నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఎక్కడకక్కడ చెక్ పోస్ట్ లు పెట్టారు అధికారులు. అయితే కొంత దురానికే వేల రూపాయలు గుంజుతున్న అంబులెన్స్ డ్రైవర్స్ కు హెచ్చరికలు జారీ చేసారు అధికారులు. ఎవరైనా సరే డబ్బులు అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు…