Business News: ఇన్వెస్టర్లపై కాసుల వర్షం.. ఒక్క సెకనులో రూ.3 లక్షల కోట్ల లాభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు దీపావళి ముహూర్తం ట్రేడింగ్ సందర్భంగా స్టాక్ మార్కెట్‌లో అద్భుతమైన ప్రారంభం కనిపించింది. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైంది. ఆ తర్వాత బీఎస్‌ఈ ప్రధాన సూచీ 65,418.98 పాయింట్లకు చేరుకుంది. దీని వల్ల ఇన్వెస్టర్లు రూ. 3 లక్షల కోట్లకు పైగా ఆర్జించారు. అయితే మార్కెట్ ప్రారంభమైన 6 నిమిషాల్లోనే 345.26 పాయింట్ల లాభంతో 65,235.78 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో టాప్ 30 షేర్లు గ్రీన్ మార్క్‌లో ట్రేడవుతున్నాయి. ఇటు.. ఐటీ కంపెనీల్లో మంచి వృద్ధి కనిపిస్తోంది. మరోవైపు, నిఫ్టీ కూడా 100 పాయింట్లకు పైగా పెరుగుదతో 19500 పాయింట్లకు పైగా పెరుగుదలతో ట్రేడవుతోంది.
Team India: రోహిత్, కోహ్లీ బౌలింగ్ చేయాలన్న ఫ్యాన్స్.. కోరిక తీర్చిన విరాట్
Also Read
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- 11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
స్టాక్ మార్కెట్‌లోని ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ రెండింటిలోనూ మంచి వృద్ధి కనిపిస్తోంది. బాంబే స్టాక్ ఎక్చేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 364 పాయింట్ల లాభంతో 65,268.84 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభంతో 65,418.98 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రధాన సూచీ నిఫ్టీ 113.10 పాయింట్ల లాభంతో 19,538.45 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. కాగా, నేడు నిఫ్టీ 19,547.25 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కోల్ ఇండియా షేర్లలో దాదాపు 4 శాతం పెరుగుదల కనిపిస్తోంది. యూపీఎల్ షేర్లు ఒకటిన్నర శాతానికి పైగా పెరుగుదలతో ట్రేడవుతున్నాయి. ఒఎన్‌జిసి, ఇన్ఫోసిస్, ఎన్‌టిపిసి షేర్లు ఒక శాతానికి పైగా పెరిగాయి. బీపీసీఎల్, అపోలో హాస్పిటల్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్ఈలో ఇన్ఫోసిస్, విప్రో షేర్లలో మంచి పెరుగుదల కనిపిస్తోంది. రిలయన్స్ షేర్లు రూ.2329 కంటే ఎక్కువగా ట్రేడవుతున్నాయి. టాటా గ్రూపునకు చెందిన టైటాన్, టీసీఎస్, టాటా స్టీల్ షేర్లలో పెరుగుదల ఉంది.
Team India: రోహిత్, కోహ్లీ బౌలింగ్ చేయాలన్న ఫ్యాన్స్.. కోరిక తీర్చిన విరాట్
స్టాక్ మార్కెట్ ఓపెన్ అయిన తీరు వల్ల మార్కెట్ ప్రారంభమైన వెంటనే ఇన్వెస్టర్లు రూ.3 లక్షల కోట్లు ఆర్జించారు. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ.3,20,29,232.24 కోట్లుగా ఉంది. కాగా ఈరోజు మార్కెట్ ప్రారంభమైన వెంటనే మార్కెట్ క్యాప్ రూ.3,23,38,359.97 కోట్లకు చేరుకుంది. అంటే ఒక్క సెకనులో బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ.3,09,127.73 కోట్లు పెరిగింది. ఇది పెట్టుబడిదారుల ఆదాయం.
తాజావార్తలు
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
-
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!