కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ తో కలసి 24 ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ సినిమా కు డైమండ్ రత్నబాబు దర్శకుడు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో మంగవారం ఉదయం విడుదల కానుంది. ‘జయ జయ మహావీర’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియో సినిమాలో మోహన్ బాబు పాత్రను ఎలివేట్ చేసేలా ఉంటుందంటున్నారు. ఓ సాధారణ రాజకీయ నాయకుడి స్థాయి నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన వ్యక్తి కథాంశంగా ఈ సినిమా ఉంటుందంటున్నారు.