మోహన్‌బాబు గారి అభినందన గొప్ప అనుభూతి– దర్శకుడు రామ్ నారాయణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్తాఫ్ హసన్ హీరోగా, శాంతిరావు, లావణ్యారెడ్డి, సాత్వికాజే హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్’. సెవెన్‌హిల్స్ సతీశ్, రామ్ వీరపనేని నిర్మించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు రామ్ నారాయణ్ తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంగీతo కూడా ఆయనే. ‘బట్టల రామస్వామి బయోపిక్’ ఇటీవలే జీ5 ఓటిటి చానల్‌లో విడుదలై చక్కని విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ‘బట్టల రామస్వామి…’ చిత్రాన్ని చూసిన అనేకమంది సెలబ్రిటీలు, విమర్శకులు సినిమా టీమ్‌ను అభినందించటం విశేషం. ఇదంతా ఒకెత్తయితే మంచు మోహన్‌బాబు సినిమాను చూసి దర్శకుడు రామ్ నారాయణ్‌ను పిలిపించుకుని అభినందించటం విశేషం. తనకు సినిమా ఎంతగానో నచ్చిందంటూ సినిమా షూటింగ్ విశేషాలను, ఎన్ని రోజుల్లో సినిమాను తెరకెక్కించారు, ఎక్కడెక్కడ చిత్రీకరణ చేశారు అని అనేక విషయాలను అడిగి తెలుసుకున్నారట. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ నారాయణ్ మాట్లాడుతూ–‘‘ నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. కరోనా సమయం అయినప్పటికీ సినిమా నచ్చటంతో నిన్ను వ్యక్తిగతంగా అభినందించాలి అని పిలిపించాను అన్నారు. మోహన్‌బాబు గారి వంటి లెజెండ్ మా సినిమాను చూసి కరోనా సమయం అయినప్పటికీ నన్ను ఆహ్వానించి అభినందనలు చెప్పటం అది ఆయన గొప్పతనం. సినిమా చూసిన ఎంతోమంది సినీ ప్రముఖులు నాకు ఫోన్ చేసి మెచ్చుకున్నారు. కానీ, మోహన్‌బాబు గారు ‘‘సన్నాఫ్ ఇండియా’’ సినిమా రిలీజ్ హడావిడిలో ఉండి కూడా నన్ను పిలిపించి మాట్లాడటంతో ఇది మా సినిమాకు దక్కిన గొప్ప విజయంగా నేను భావిస్తున్నా’’ అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Ram Charan : RC 17.. ఓ చిన్న కన్ఫ్యూజన్
-
Broken Cups Reuse Idea: విరిగిన కప్పులే మీ ఇంటి అందాన్ని పెంచుతాయి.. ఈ ట్రిక్స్ తెలుసా?
-
SS Rajamouli: “ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది”.. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
ట్రెండింగ్
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!