నందమూరి బాలకృష్ణ సినిమాల్లో ఆయన పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో విలన్ లకు కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. “లెజెండ్” సినిమాతో జగపతి బాబు కెరీర్ ఎలా టర్న్ తీసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే బాలయ్య కోసం మరో సీనియర్ హీరో మోహన్ బాబు కూడా విలన్ గా మారడానికి రెడీ అయిపోయారు.
Read also : బిగ్ బాస్ 5 : డేంజర్ జోన్ లో ఆ ముగ్గురూ ?
బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న టాక్ షో “అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే” ఫస్ట్ ఎపిసోడ్ ఈరోజు ఆహాలో ప్రీమియర్ అయ్యింది. ఉదయం 11:20 గంటలకు ప్రసారం అయిన ఈ షోలో నందమూరి బాలకృష్ణ ‘పైసా వసూల్’ సాంగ్ తో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇంట్రడక్షన్ డైలాగ్స్, డ్యాన్స్‌తో అదరగొట్టాడు. ఆయన కాస్ట్యూమ్‌లు అత్యద్భుతంగా ఉన్నాయి. “అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే” షో మొదటి ఎపిసోడ్‌లో మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి అతిధులుగా వచ్చారు. బాలయ్య మోహన్ బాబును కొన్ని ఆసక్తికర కొంటె ప్రశ్నలు అడిగారు. అయితే ఈ షోలో భాగంగానే బాలయ్య హీరో అయితే తనకు విలన్ గా చేయడానికి ఏ ఇబ్బంది లేదని స్పష్టం చేశాడు మోహన్ బాబు. మరి వీరిద్దరి కోసం ప్రేక్షకులను మెప్పించే కథను సిద్ధం చేసుకుని ఏ దర్శకుడు ముందుకు వస్తాడో చూడాలి.