(డిసెంబర్ 24న ‘కిరాయి రౌడీలు’కు 40 ఏళ్ళు)మెగాస్టార్ చిరంజీవి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు హీరోలుగా నటించిన ‘కిరాయి రౌడీలు’ చిత్రం డిసెంబర్ 24తో 40 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. శ్రీక్రాంతి చిత్ర పతాకంపై ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో టి.క్రాంతికుమార్ ఈ సినిమాను నిర్మించారు. ఇందులో చిరంజీవికి జోడీగా రాధిక నటించారు. 1981 డిసెంబర్ 24న ‘కిరాయిరౌడీలు’ విడుదలయింది. అంతకు ముందు అదే సంవత్సరంలో క్రాంతికుమార్ నిర్మించిన ‘న్యాయం కావాలి’లో చిరంజీవి, కోదండరామిరెడ్డి తొలిసారి కలసి పనిచేశారు. వారిద్దరి…
కరోనా సంక్షోభం మధ్య ఈ డిసెంబర్‌లో అనేక తెలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన “అఖండ” చిత్రం అత్యంత భారీ స్థాయిలో విడుదలైంది. ఈ సినిమా అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. థియేటర్లకు వచ్చి సినిమాలను ఆస్వాదించడానికి జనాలు ఎలాంటి సమయంలోనైనా ఇష్టపడతారని “అఖండ” రోరింగ్ సక్సెస్ నిరూపించింది. తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేసేందుకు టాలీవుడ్ నిర్మాతలకు ఈ చిత్ర విజయం బలాన్నిచ్చింది. తాజాగా “అఖండ” చిత్ర…
ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతరామశాస్త్రి ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు.. సిరివెన్నెల అంత్యక్రియలకు టాలీవుడ్ మొత్తం కదిలివచ్చింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూ. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు సిరివెన్నెలను కడసారి చూసి సంతాపం తెలిపారు. అయితే ఆరోజు ఎక్కడా మోహన్ బాబు ఫ్యామిలీ కనిపించలేదు.. దీంతో మంచు ఫ్యామిలీ ఎందుకు రాలేదు…
మోహన్ బాబు 47 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఆయనకు 47 సంవత్సరాలు ఏంటని ఆశ్చర్యపోకండి. నటుడుగా ఆయన వయసు ఇది. నవంబర్ 22, 1975న విడుదలైన ‘స్వర్గం నరకం’ సోమవారంతో 47 ఏళ్లు పూర్తి చేసుకుంది. మోహన్‌బాబు కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ఇది. ఇది మంచు కుటుంబ అభిమానులకు సంతోషకరమైన రోజు. దివంగత దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ డ్రామా ఎంతో మంది కెరీర్ కు పూల బాట వేసింది. మోహన్ బాబు…
సీనియర్ నటుడు, నిర్మాత మోహన్‌బాబు నివాసంలో విషాదం నెలకొంది. మోహన్‌బాబు సోదరుడు రంగస్వామి నాయుడు గుండెపోటుతో బుధవారం మృతి చెందారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రంగస్వామి నాయుడు చనిపోయినట్లు తెలుస్తోంది. ఆయన వయసు 63 సంవత్సరాలు. కొంత కాలంగా రంగస్వామినాయుడు అనారోగ్యంతో బాధ పడుతున్నారు. తిరుపతిలో ఉంటూ వ్యవసాయం చేసుకునే ఆయన… మోహన్‌బాబు చేపట్టే పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు అని సన్నిహితులు చెప్తున్నారు. Read Also: వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి చేయాలి: చిరంజీవి…
నటసింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ‘అన్ స్టాపబుల్ యన్.బి.కె.’ టాక్ షో దీపావళి రోజున ‘ఆహా’ ఓటీటీలో ఆరంభమయింది. మొదటి రోజునే బాలకృష్ణ ప్రోగ్రామ్ లో గెస్ట్స్ గా ప్రముఖ నటుడు మోహన్ బాబు, ఆయన కూతురు మంచు లక్ష్మి, తనయుడు మంచు విష్ణు రావడం విశేషమనే చెప్పాలి. ఈ ఎపిసోడ్ యాభై నిమిషాలు ఉంది. ఎవడాపుతాడో చూద్దాం… ఆరంభంలో బాలకృష్ణ ఏకపాత్రాభినయం చేస్తున్నట్టుగా తన గురించి జనం ఏమనుకుంటున్నారో వివరిస్తూ తెరపై కనిపించడం ఆకట్టుకుంటుంది.…
నందమూరి బాలకృష్ణ సినిమాల్లో ఆయన పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో విలన్ లకు కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. “లెజెండ్” సినిమాతో జగపతి బాబు కెరీర్ ఎలా టర్న్ తీసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే బాలయ్య కోసం మరో సీనియర్ హీరో మోహన్ బాబు కూడా విలన్ గా మారడానికి రెడీ అయిపోయారు. Read also : బిగ్ బాస్ 5 : డేంజర్ జోన్ లో ఆ ముగ్గురూ ? బాలయ్య అభిమానులు…
(అక్టోబర్ 29న ‘భలేదొంగలు’కు 45 ఏళ్ళు పూర్తి)ఉత్తరాదిన విజయం సాధించిన చిత్రాల ఆధారంగా వందలాది దక్షిణాది సినిమాలు రూపొంది అలరించాయి. 1970లలో అనేక హిందీ చిత్రాలు తెలుగులో రీమేక్ అయి మురిపించాయి. టాప్ స్టార్స్ అందరూ హిందీ రీమేక్స్ పై మోజుపడ్డ రోజులవి. హిందీలో శశికపూర్, ముంతాజ్ జంటగా రూపొందిన ‘చోర్ మచాయే షోర్’ ఆధారంగా తెలుగులో కృష్ణ, మంజుల జోడీగా ‘భలే దొంగలు’ చిత్రం తెరకెక్కింది. కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వంలో త్రిమూర్తి ప్రొడక్షన్స్ పతాకంపై జి.సాంబశివరావు,…
యంగ్ హీరో మంచు మనోజ్ సినిమాల నుంచి చిన్న విరామం తీసుకున్నాడు. అప్పుడప్పుడూ కొన్ని సామాజిక కార్యక్రమాల్లోనూ కనిపిస్తున్నాడు. ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల సమయంలో మంచు మనోజ్ కన్పించి వార్తల్లో నిలిచాడు. తన సోదరుడు విష్ణుకు సహాయం చేయడంతో పాటు రెండు ప్యానల్లు అనవసరమైన హింసకు పాల్పడకుండా చూసుకోవడానికి మనోజ్ తన శాయశక్తులా ప్రయత్నించాడు. ఆ తరువాత “భీమ్లా నాయక్” సెట్ లో పవన్ ను కలిశాడు. తాజాగా మనోజ్ రెండవ…
నందమూరి బాలకృష్ణ ఓటీటీ లో అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ పేరుతో ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. ఇక ఈ ప్రోగ్రాం కి ‘జాంబీ రెడ్డి’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. నవంబర్ 4 నుంచి మొదలుకానున్న ఈ ప్రోగ్రాం లో ఫస్ట్ గెస్ట్ ఎవరు అనేదానిమీద సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరు అవుతున్నారు అనే…