TPCC Mahesh Goud : రేవంత్ రెడ్డి నిర్ణయంతో మోడీనే పరేషాన్‌లో ఉన్నాడు
- రేవంత్ రెడ్డి మొనగాడు.. దమ్ముంటేనే ఇలాంటి నిర్ణయం తీసుకోగలడు
- రాహుల్ గాంధీ కలను ముందుకు తీసుకెళ్తున్న రేవంత్
- బీసీ బిల్లులపై కేంద్రంపై మండిపాటు
- బీజేపీపై విమర్శలు.. రిజర్వేషన్లు సాధించే వరకు వెనక్కి తగ్గం : టీపీసీసీ చీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Mahesh Goud : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన బీసీ మహా ధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ధైర్యవంతమైన నిర్ణయం వల్ల కేవలం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రమే కాకుండా, ప్రధానమంత్రి మోడీనే పరేషాన్‌లో ఉన్నాడని ఆయన అన్నారు.
మహేష్ గౌడ్ మాట్లాడుతూ, “సహాసోపేత నిర్ణయం తీసుకోవాలంటే దమ్ము ధైర్యం ఉండాలి. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. సపోర్ట్ చేయలేక, తిరస్కరించలేక మోడీ ముస్లింల అంశాన్ని ముందుకు తెస్తున్నాడు” అని వ్యాఖ్యానించారు.
Also Read
- Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
- TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
- Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
- DSC 2008 : డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు షాక్.. మూడు పిటిషన్లు కొట్టివేత
“రాహుల్ గాంధీ ఆశయానికి బీసీలు రుణపడి ఉండాలి. ఆయన కలను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సైనికుడిగా ముందుకు తీసుకెళ్తున్నాడు. దేశంలోని ఓబీసీలంతా ఇప్పుడు రేవంత్ వైపు చూస్తున్నారు. రాహుల్ ఎప్పుడైనా మాట్లాడినా తెలంగాణ అంశాన్ని ప్రస్తావిస్తారు,” అని చెప్పారు.
Suicide: భార్య, అత్తమామల వేధింపులతో అల్లుడి ఆత్మహత్య..! హృదయవిదారక వీడియో..
బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు బిల్లులు నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు. “మన బాధ మోడీకి తెలియజేయడానికే ఈ ధర్నా చేస్తున్నాం. కేంద్రం బిల్లులను తొక్కిపెట్టింది. ఆర్డినెన్స్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలంటే గవర్నర్ అడ్డుపడుతున్నారు,” అని ఆరోపించారు.
“కిషన్ రెడ్డి జీవితంలో ఏ పని చేసి గెలిచాడా? మేము పూజలు చేస్తాం కానీ దేవుళ్ల పేరు మీద ఓట్లు అడగం. చేతకాని దద్దమ్మలు దేవుళ్లను ముందు పెట్టి ఓట్లు అడుగుతున్నారు. సికింద్రాబాద్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు లేకుండా కిషన్ రెడ్డి నామినేషన్ వేయగలడా? అసెంబ్లీలో బీసీ బిల్లుకు ఓటు వేసిన బీజేపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎందుకు తోకముడుస్తున్నారు?” అని ప్రశ్నించారు.
“బీసీలకు మద్దతుగా అన్ని వర్గాలు జంతర్ మంతర్‌కి తరలివచ్చాయి. ఓబీసీ రిజర్వేషన్లలో రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి కూడా చరిత్రలో నిలుస్తారు. మేము బీసీల విషయంలో చిత్తశుద్ధితో ఉన్నాం. రిజర్వేషన్లు సాధించే వరకు ఎంత దూరమైనా వెళ్తాం. కాంగ్రెస్ అందరి పార్టీ. కేంద్రం దిగివచ్చి రిజర్వేషన్ల క్యాప్ తొలగించాల్సిందే,” అని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు.
Ghaati Trailer: సీతమ్మోరు లంకా దహనం చేస్తే? అనుష్కకి మరో అరుంధతి దొరికిందిగా!
తాజావార్తలు
-
Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!