దేశవ్యాప్తంగా మహమ్మారి టీబీ అదుపులో వున్నా.. డెంగ్యూ మాత్రం తన ప్రతాపం చూపుతూనే వుంది. కేంద్రం టీబీ, డెంగ్యూలకు వ్యాక్సిన్ల ను తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబిచ్చారు. అమెరికాలో 9 నుంచి 16 ఏళ్ళ మధ్య పిల్లల కోసం డెంగ్యూ వాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. భారత్లో కూడా డెంగ్యూ నివారణకు ఈ తరహా వాక్సిన్ తీసుకువచ్చే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందా అని ఈరోజు రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు…
విప్లవ కవి వరవరరావుని మెడికల్ పరీక్షల కోసం ప్రైవేటు హాస్పిటల్ కు తరలించాలని ఎన్ఐఏను ఆదేశించింది బాంబే హైకోర్టు. మెడికల్ టెస్ట్ లకు అయ్యే ఖర్చులను ఎన్ఐఏ భరించాలని బాంబే హైకోర్టు ఆదేశాలిచ్చింది. వరవరరావుకు మెడికల్ టెస్టులు నిర్వహించాలని గతంలోనే బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైద్యానికి అయ్యే ఖర్చులు ఎవరు భరించాలి అనే అంశంపై స్పష్టత ఇచ్చింది బాంబే హైకోర్టు. భీమా కోరేగావ్ కేసులో అరెస్ట్ అయిన వరవరరావు.. కొన్ని నెలలపాటు జైలు శిక్ష…
గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలను తీసుకవచ్చిన విషయం తెలిసిందే. అయితే చట్టాలు ఆమోదయోగ్యంగా లేవంటూ ఇటు ప్రతిపక్షాలు, అటు రైతులు దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా దేశ రాజధాని ఢిల్లీలో సంవత్సరం పాటు రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకొని 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే నేడు శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ వ్యవసాయ చట్టాల…
ఇటీవల కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను కూడా క్షమాపణలు కోరారు. అయితే తాజాగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. వ్యవసాయంపై ప్రధాని కమిటీ ఏర్పాటు చేశారని ఆయన వెల్లడించారు. పంట వైవిధ్యం, జీరో-బడ్జెట్ వ్యవసాయం, “కనీస మద్దతు ధర”లో పారదర్శకత లాంటి అంశాలను కమిటీ…
ప్రధాని మోడీ అధ్యక్షతన ఈరోజు ఉదయం 10:30 గంటలకు అత్యవసర సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి, కీలక అధికారులు హాజరుకాబోతున్నారు. కరోనా కొత్త వేరియంట్ పై వస్తున్న వార్తల నేపథ్యంలో దీనిపైనే కీలకంగా చర్చించే అవకాశం ఉన్నది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్పై ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ వేరియంట్ లో 32 మ్యూటేషన్లు ఉన్నట్టు ఇప్పటికే పరిశోధకులు తెలిపారు. Read: 63శాతం పెరిగిన టమోటా ధరలు… ధరల స్థిరీకరణకు……
ప్రధాని మోడీపై ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోడీ జీ 7 సంవత్సరాల నుండి రోజుకు 18 గంటలు పని చేస్తూ తన బెస్ట్ ఫ్రెండ్ (గౌతమ్ అదానీ)ను ఆసియాలోనే అత్యంత ధనవంతునిగా మారే కలను సాకారం చేసుకున్నారంటూ ట్విట్టర్లో పోస్టు చేశారు. అయితే గతంలో చైనాకు చెందిన ఓ పత్రిక ప్రధాని నరేంద్ర మోడీ ఉదయం 5.30 గంటల నుంచి అర్థరాత్రి 1 గంట వరకు పనిచేస్తున్నారని.. ఆయన పెండింగ్లో…
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన రైతులు ఆందోళనలు ఆపేలా లేరు. తమ డిమండ్లనున నేరవేర్చే వరకు ఇంటికి వెళ్లబోమని కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. రైతు చట్టాలను రద్దు చేసింనదుకు హర్షం వ్యక్తం చేసినా… తమ డిమాండ్లు పరిష్కరించాల్సిందేనని వారు అంటున్నారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి నవంబర్ 26తో ఏడాది పూర్తి కానున్న తరుణంలో నవంబర్ 29న 300మంది రైతులతో కలిసి 30 ట్రాక్టర్లలో ర్యాలీగా ఢిల్లీకి చేరుకుంటారని బీకేయూ…
మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తానన్న తన వాగ్దానాన్ని త్వరగా నెరవేర్చడానికి ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధంగా ఉన్నారని కేంద్ర మంత్రివర్గం తెలిపింది. దీనికి సంబంధించి ‘ది ఫార్మ్ లాస్ రిపీల్ బిల్లు, 2021’ ఆమోదం కోసం తీసుకోనుంది. న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి లోక్కల్యాణ్ మార్గ్ నివాసంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశం కానుంది. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకో వడానికి ఒక సమగ్ర “రద్దు బిల్లు” మాత్రమే తీసుకురావచ్చని…
ప్రధాని నరేంద్రమోడీ 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో దూకుడుగా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే విధంగా మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారు. ఈ మూడు నల్ల చట్టాల ను రద్దు చేయాలని కోరుతూ.. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లోనే కొన్ని నెలలుగా రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెల్సిందే.. అయితే ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం ఆ వ్యవసాయ చట్టాలను ఉపసం హరించుకుంటున్నట్టు ప్రకటించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ.. మోదీ ప్రకటించడంతో… ఈ దేశ రైతుల…
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, అనంతర పరిస్థితులను ఆరా తీశారు ప్రధాని నరేంద్ర మోడీ. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల పరిస్థితిని ప్రధానికి వివరించారు జగన్. వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం వైయస్ జగన్ ఏరియల్ సర్వే చేయనున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా భారీ వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు జగన్. బంగాళా ఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా గత వారం రోజులుగా…