ప్రధాని మోడీ ఈరోజు ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే ను ప్రారంభించబోతున్నారు. భారత్ వాయుసేనకు చెందిన సీ 130 జె సూపర్ హెర్క్యులస్ విమానంలో ఎక్స్‌ప్రెస్ వే పై దిగనున్నారు. అనంతం ఎక్స్‌ప్రెస్‌వేను జాతికి అంకితం చేస్తారు. 340 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారిపై అక్కడక్కడా వాయుసేన విమానాలు అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యేందుకు అనుగుణంగా సిమెంట్ వే లను నిర్మించారు. Read: నవంబర్ 16, మంగళవారం దినఫలాలు… ఆదివారం రోజున…
ఇటీవల ఎప్పుడు ఏదో ఒక కాంట్రావర్సీతో వార్తల్లో నిలుస్తున్న కంగనా పై తాజాగా అసదుద్దీన్ ఓవైసీ సైటైర్లు విసిరారు. స్వాతంత్ర్యంపై కంగనా చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. కంగనా 2014లోనే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని, 1947లో వచ్చింది కేవలం భిక్ష అని కామెంట్స్ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా కంగనా పై విమర్శల పాలైంది. తను తీసుకున్న పద్మశ్రీ అవార్డును సైతం వెనక్కి ఇచ్చి వేయాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. దీనిపై బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా…
తెలంగాణలో టీఆర్ఎస్ నేతల తీరుపై మండిపడ్డారు బీజేపీ ఎంపీ సోయం బాపురావ్. ఆదిలాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. హుజురాబాద్ ఓటమి తట్టుకోలేక వరి ధాన్యం పై రాద్దాంతం చేస్తున్నారని, కేంద్రం వరి ధాన్యం కొనము అని ఎక్కడా చెప్పలేదన్నారు. టీఆర్ఎస్ నేతలు బజార్ రౌడీల్లా మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ నాయకులు పరిధి దాటి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీని బదనాం చేయడం కోసం తప్ప రైతులకు మేలు చేసే ఆలోచన టీఆర్ఎస్ కు లేదు. రైతుల మీద ప్రేమ…
సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ రాజకీయాల గురించి తప్ప మిగతా విషయాల గురించి అంతగా మాట్లాడరు. కానీ సినిమా తారల గురించి ప్రస్తావిస్తూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ స్వతంత్ర ఉద్యమాన్ని అవమానిస్తూ కంగనా రౌనత్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి 1947లో వచ్చింది స్వాతంత్రం కాదు అని భిక్ష అని కంగనా పేర్కొనడంపై తీవ్రంగా…
తెలంగాణలో జరిగిన హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఫలితాలపై ప్రధాని, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంతృప్తిని వ్యక్తం చేస్తూ , రాష్ట్రపార్టీ నేతలను అభినందించారు. తెలంగాణలో, దక్షిణభారత దేశంలో బీజేపి బలపడుతుందన్న విశ్వాసాన్ని ప్రధాని, పార్టీ జాతీయ అధ్యక్షుడు జే.పి.నడ్డా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో బద్వేల్ ఉపఎన్నికలలో ఓట్లశాతం పెరుగుదలపై సంతృప్తిని వ్యక్తం చేశారు. “దళితబంధు” పథకాన్ని రాష్ట్రమంతా అమలు చేసేలా తెలంగాణ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువస్తామన్నారు బీజేపీ నేతలు. కేంద్ర…
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటోందని ప్రధాని మోడీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆదివారం బీజేపీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ తో పాటు జెపీ నడ్డా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రల్లో పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా మారుతున్నాయన్నారు. అంతేకాకుండా దుబ్బాక, హుజురాబాద్ ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ నేతలను ప్రత్యేకంగా అభినందించారు. ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లోనూ బీజేపీదే విజయమని ఆయన అన్నారు.…
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలనే డిమాండ్ పెరుగుతోంది. ప్రభుత్వానికి వ్యాట్ సెగ తగులుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని విపక్షాలు ఒత్తిడి పెంచుతున్నాయి. ఎన్డీయే పాలిట ప్రభుత్వాలు ధరలు తగ్గించాయి. వ్యాట్ ని భారీగా తగ్గించాయి. దీంతో బీజేపీయేతర పార్టీలు అధికారంలో వున్న చోట ధరలు తగ్గించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ డిమాండ్ తీవ్రత పెంచుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గించే అవకాశం లేదని తెలుస్తోంది. కేంద్రం నిర్ణయం…
దీపావళి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ప్రతిరోజు పెరుగుతున్న వేళ ఉపశమనం కలిగించింది కేంద్రం. దీపావళి వేళ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన సంగతి తెలిసిందే. పెట్రోల్ పై 5, డీజిల్ పై 10 రూపాయలు తగ్గించడంతో ధరలు దిగివచ్చాయి. ఈ తగ్గింపు ధరలు గురువారం ఉదయం నుంచి అమలులోకి…
కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ మహిళల కోసం ఇప్పటికే ఎన్నో పథకాలు ప్రవేశపెడుతూ వారి ఆర్థిక స్వాలంబనకు కృషి చేస్తుంది. తాజగా మహిళలకు మోడీ మరో శుభవార్తను చెప్పింది. స్వయం సంఘాల్లోని మహిళల ఆర్థిక స్థితి గతులను పెంచేందుకు మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ప్రతి ఏడాది రూ. లక్ష సంపాదించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనికోసం ప్రత్యేకంగా ల్యాక్‌పతి…