ఢిల్లీలోని భారత మండపంలో అఖిల భారతీయ శిక్షా సమాగమ్ లో జరుగుతున్న ఎగ్జిబిషన్ లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. కొత్త జాతీయ విద్యా విధానం (NEP) ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధాని ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ నిర్మించిన మేరి బల్వాటిక వద్దకు చేరుకున్న ప్రధాని మోడీ.. పిల్లలతో చాలా సేపు సరదాగా గడిపారు. అంతేకాకుండా వారితో ముచ్చటించిన వీడియోను ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో చిన్న పిల్లలు ప్రధాని మోడీ-మోడీ జీ అని పిలుస్తూ కనిపించారు.
Krishna Gadu Ante Oka Range: సినిమా రిలీజ్ చేయడమే అతి పెద్ద విజయం అనిపిస్తోంది!
పిల్లలతో గడిపిన కొన్ని ఆనంద క్షణాలు.. వారి శక్తి మరియు ఉత్సాహం మనస్సులో ఉత్సాహాన్ని నింపుతుందని ప్రధాని మోడీ ట్విట్టర్ లో తెలిపారు. పీఎం మోడీ బాల్ వాటికలోకి రాగానే చిన్నారులంతా నమస్తే మోడీ జీ, నమస్తే మోడీ జీ అని చెప్పడం వీడియోలో కనిపిస్తోంది. అనంతరం ప్రధాని మోడీ పిల్లల వద్దకు వెళ్లి మాట్లాడారు. మోడీ జీ మీకు తెలుసా? అని పిల్లలను ప్రధాని అడిగారు. దీంతో ఓ చిన్నారి మోడీ జీ.. మిమ్మల్ని టీవీలో చూశాం అని చెపుతుంది. అప్పుడు ప్రధాని మోదీ నేను టీవీలో ఏమి చేస్తున్నాను అని అడిగారు. ఈ వీడియోలో పిల్లలు ప్రధాని మోడీతో చనువుగా ఉండం కనిపిస్తుంది. అంతేకాకుండా పిల్లలను ప్రధాని ప్రశ్నిస్తూ సమాధానాలు ఇస్తూ కనిపిస్తారు.
Bhola shankar : మెగాస్టార్ క్రేజ్ మాములుగా లేదుగా.. ఏకంగా భారీ కటౌట్ ఏర్పాటు..
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. యువత ప్రతిభను కాకుండా వారి భాషను బట్టి అంచనా వేయడం సరికాదని అన్నారు. భారత్‌లో తమ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయని ప్రధాని తెలిపారు. తమ దేశాల్లో కూడా ఐఐటీ క్యాంపస్‌లను ప్రారంభించమని కోరుతున్నట్టు పేర్కొన్నారు. ఐఐటీ క్యాంపస్‌లను అబుదాబి, టాంజానియాలో ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాని పేర్కొన్నారు. భారత్‌ను పరిశోధన ఆవిష్కరణలకు హబ్‌గా మార్చడమే జాతీయ విద్యావిధాన లక్షమని తెలిపారు. మన విద్యావిధానం సంప్రదాయ విజ్ఞాన వ్యవస్థకు, భవిష్యత్తు సాంకేతికతకు సమాన ప్రాముఖ్యతను ఇచ్చిందన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు విపత్తు, ప్రతిస్పందన, వాతావరణ మార్పులు, క్లీన్ ఎనర్జీలపై అవగాహన కల్పించాలని మోడీ కోరారు.
मासूम बच्चों के साथ आनंद के कुछ पल! इनकी ऊर्जा और उत्साह से मन उमंग से भर जाता है। pic.twitter.com/rGY2mv5eK8
— Narendra Modi (@narendramodi) July 29, 2023