సాధారణ కార్యకర్తగా, ఆర్ఎస్ఎస్ పిద్ధాంతాలను ఒంట బట్టించుకున్న డా.కె.లక్ష్మణ్ సుదీర్ఘకాలం బీజేపీ కోసం పనిచేశారు. గతంలో బీజేపీ తరఫున ముషీరాబాద్ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేశారు. జాతీయ ఓబీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న లక్ష్మణ్ కు రాజ్యసభ పదవి దక్కింది. యూపీ నుంచి ఆయనకు బీజేపీ పెద్దల సభకు అవకాశం ఇచ్చింది. దీంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. గతంలో జీవీఎల్ నరసింహారావుకి యూపీ నుంచి ఎంపీగా అవకాశం ఇచ్చింది బీజేపీ. తాజాగా…
మాదిగలకు అన్యాయం చేసే పార్టీలకు తగిన బుద్ధి చెబుతామన్నారు మందకృష్ణ మాదిగ. మాదిగల సంగ్రామ పాదయాత్రను ప్రారంభించిన మందా కృష్ణమాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి విజయవాడ వరకూ 88 నియోజకవర్గాల గుండా పాదయాత్ర సాగనుంది. పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణకు ముందుకు రానిపక్షంలో ఎందుకు పార్టీ తీర్మానాలు చేసారో బీజేపీ పెద్దలు సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ పాలకులకు చిత్త శుద్ధి లేదు. మాదిగలను మరో ఉద్యమానికి సిద్దం చేసేందుకు , కేంద్రంపై ఒత్తిడి…
దేశంలో చమురుధరలు ఆకాశాన్నంటాయి. ఈమధ్య కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ధరలు కొంచెం దిగివచ్చాయి. కొన్ని రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించుకోవడంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగిపోవడంతో ద్రవ్యోల్బణం కూడా బాగా పెరిగింది. ఆల్ టైం హైకి చేరింది. గోధుమల ధరల్ని నియంత్రించేందుకు కేంద్రం ఎగుమతుల్ని నిషేధించింది. అదే బాటలో మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. పంచదార ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశంలో ధరలు పెరిగిపోతున్న…
కోవిడ్ ఆర్థిక పరిస్థితులు, ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయని, ఆ ఎఫెక్ట్ అమెరికా వంటి దేశాలతో పాటు భారత్ పై కూడా పడిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కొద్ది రోజుల కింద ప్రజలపై భారం తగ్గించేందుకు కేంద్రం ఛార్జీలు తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వ్యాట్ తగ్గించలేదు. అటల్ బిహారీ వాజ్ పేయి ఫౌండేషన్ స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,బీజేపీ…
వేలాదిమందికి ఉపాధి కలిగించింది. లక్షలాదిమందికి అన్నం పెట్టింది. ఎంతో చరిత్ర కలిగిన ఆదిలాబాద్ సీసీఐ కథ చివరి దశకు చేరింది. సిమెంట్ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల బీజేపీ మినహా అన్నీ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు భగ్గుమంటున్నాయి. CCI సాధన కమిటీ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా కేంద్రానికి వ్యతిరేకంగా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసేందుకు సిద్ధమౌతున్నారు. సిమెంట్ పరిశ్రమను పున:ప్రారంభించాలంటూ…