దేశంలో బీసీ జనాభా ఎంత వుందో కులగణన చేస్తేనే తెలుస్తుందని బీసీ నేతలు అంటున్నారు. ఏపీలో టీడీపీ ఎంపీ రామ్మోహననాయుడు ఢిల్లీ వేదికగా బీసీ కులగణన కోసం పోరాడుతున్నారు. బీసీ కులగణన సాధించేవరకు నేను మీ వెంటే ఉంటానని, జనగణనలో కులగణన జరగాల్సిన అవసరం ఉందన్నారు రామ్మోహన్ నాయుడు. టీడీపీకి వెన్నెముకగా బీసీలు నిలిచారన్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు బీసీల డిమాండ్ల కు మద్దతుగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషం అన్నారు. బీసీల కార్యక్రమం ఎక్కడ…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోయే విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నేషనల్ కోర్దినేషన్ కమిటీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జేఏసీ అధ్వర్యంలో కేటీపీపీ 11వందల మెగావాట్ల ప్రధాన ద్వారం ముందు అన్నీ అసోసియేషన్లు,ట్రేడ్ యూనియన్ల సిబ్బందితో నిరసన చేపట్టారు. విద్యుత్తు సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసే కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని జాతీయ విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్ల సమన్వయ కమిటీ (ఎన్సీసీఓఈఈఈ) పిలుపు నిచ్చింది. ఇందులో భాగంగా చెల్పూర్ కాకతీయ థర్మల్ విద్యుత్…
టీఎంసీ ఎంపీ నుస్రత్ ఖాన్ మోడీ ప్రభుత్వం తీరుపై లోక్ సభలో మండిపడ్డారు. దేశంలో నవరత్న, మహారత్న కంపెనీలను అమ్మేయడంపై ఆమె తీవ్రంగా విమర్శించారు. లాభాల్లో వున్న నవరత్న కంపెనీలను ఎడాపెడా అమ్మేయడం ఏంటన్నారు. లక్షలాదిమందికి ఉపాధి కల్పిస్తూ.. దేశ సంపదను పెంచే కంపెనీలను ఎలా ప్రైవేటు వ్యక్తుల పరం చేస్తారని నుస్రత్ ఖాన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. నుస్రత్ ఖాన్ ప్రసంగం లోక్ సభలో చర్చనీయాంశం అయింది. సెయిల్, గెయిల్, కోల్ ఇండియా, ఎయిర్ ఇండియా…
వానాకాలం వరి ధాన్యాన్ని ఎంతకొంటామనే విషయంపై కేంద్రం ఎటూ తేల్చలేదు. యాసంగి లో పండే బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని ఖరాఖండి గా తేల్చిచెప్పింది కేంద్రం. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలతో న్యూ ఢిల్లీలో మంగళవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్., కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ లతో విడి విడిగా దాదాపు మూడున్నర గంటల పాటు సుధీర్గంగా చర్చించారు రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఉన్నతాధికారుల బృందం. రాష్ట్రం నుంచి…
విశాఖలో ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై యావత్ ఆంధ్రరాష్ట్రం భగ్గుమంటోంది. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖపట్నంలో విద్యార్ది లోకం రోడ్డెక్కారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం కానివ్వబోమని గర్జించారు. విశాఖ ఏవిఎన్ కాలేజ్ నుండి పాత పోస్టాఫీసు వరకూ భారీ ప్రదర్శన నిర్వహించారు. పలు విద్యార్ది యూనియన్ లకు చెందిన జాతీయ స్థాయి నాయకులు కూడా ఈ నిరసన లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ ఎఫ్…
కరోనాకు చెక్ పెట్టేందుకు ఏకైక మార్గం వ్యాక్సినేషనే అంటున్నారు వైద్య నిపుణులు.. అయితే, ఈ నెల 1వ తేదీ నుంచి భారత్‌లో వ్యాక్సినేషన్ ఊపందుకుంటుందని భావించినా.. డోసుల కొరతతో.. గతంలో కంటే వ్యాక్సినేషన్ స్పీడ్ తగ్గుతూ వస్తోంది. ఈ వ్యవహారంలో కేంద్రంలోని మోడీ సర్కార్‌ను టార్గెట్ చేశారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం.. రోజు రోజుకూ వ్యాక్సిన్లు ఇచ్చే సంఖ్య తగ్గుముఖం పట్టడాన్ని ప్రస్తావిస్తూ.. సర్కార్ వ్యాక్సిన్ వ్యూహాన్ని ప్రశ్నించారు. ఏప్రిల్…