సుధీర్ఘ చర్చల తర్వాత జిల్లా అధ్యక్ష పదవులను భర్తీ చేసింది అధికార టీఆర్ఎస్. తెలంగాణ ఉద్యమ సమయంలో మాత్రమే పార్టీకి జిల్లా అధ్యక్షులు ఉండేవారు. ఆ తర్వాత ఈ పదవుల జోలికి వెళ్లలేదు అధిష్ఠానం. అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేనే సుప్రీం అని గులాబీ పార్టీ స్పష్టం చేసింది. కానీ.. కొద్ది నెలల క్రితం రాష్ట్రంలోని 33 జిల్లాలకు అధ్యక్షులను నియమించింది టీఆర్ఎస్. వీరిలో ఎక్కువగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్‌లు ఉన్నారు. నియామక ప్రక్రియ…
Telangana Legislative Council Live Updates. మెదక్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలీస్ కార్యాలయం పనులను తొందరగా పూర్తి చేయాలని ఎమ్మెల్సీ శేరి శుభాష్ రెడ్డి ఇవాళ శాసనమండలిలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో బస్సుల సంఖ్యను తగ్గిస్తున్నారని అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. బస్సుల సంఖ్య తగ్గించకుండా ప్రజా రవాణాను అందరికి అందుబాటులో ఉంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఆర్టీసీ కార్మికులకు బకాయి పడిన రెండు పీఆర్సీలు, రెండు డీఏలను వెంటనే చెల్లించాలన్నారు.…
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ చాంబర్‌లో ప్రొటెం చైర్మన్ జాఫ్రీ కవితతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఏకగ్రీవంగా ఎన్నికైనా కవితతో పాటు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల స్థానం నుంచి ఎన్నికైనా కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఇంకా మరో పదిమంది ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. Read Also: ఇండియా టెన్నిస్ స్టార్ సానియామీర్జా రిటైర్మెంట్ కవితతో పాటు స్థానిక…
ఉపఎన్నికలో బంపర్ మెజారిటీతో గెలిచిన ఆ నియోజకవర్గం TRSలో గ్రూప్‌ఫైట్ మొదలైందా? ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య ఆధిపత్యపోరు రాజుకుందా? గ్రూపులు యాక్టివ్ అవుతున్నాయా? ఏంటా నియోజవర్గం? ఎవరా నాయకులు? భగత్‌పై అసంతృప్తులు.. వ్యతిరేక సెగలు..!ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్. ఆ మధ్య ఉపఎన్నిక రావడంతో అందరి దృష్టీ ఈ నియోజకవర్గంపై నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో వచ్చిన ఉపఎన్నికలో ఆయన కుమారుడు నోముల భగత్ గెలిచారు. ఆ పోరు ముగిసిన 8 నెలలకే…
వారిద్దరూ అధికారపార్టీ ప్రజాప్రతినిధులే. ఒకే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. ఒకరినొకరు ఎదురుపడటానికి కూడా ఇష్టపడరని టాక్. ఇప్పుడు ఆ వార్.. పార్టీలోనూ చిచ్చు పెడుతోందట. విభేదాలు రోడ్డెక్కి రచ్చ రచ్చ..!ఈయన కాసు మహేష్‌రెడ్డి. వైసీపీ ఎమ్మెల్యే. ఇంకో నేత జంగా కృష్ణమూర్తి. వైపీపీ ఎమ్మెల్సీ. ఇద్దరిదీ గుంటూరు జిల్లా గురజాల. పల్నాడు ప్రాంతానికి చెందిన ఈ ఇద్దరు నాయకులు అధికారపార్టీలోనే ఉన్నా.. ఒకరినొకరు వైరిపక్షాలుగా చూసుకుంటారు. ఇద్దరి మధ్య…
గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. మధుసూదనాచారి చేత శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన మధుసూదనాచారికి మంత్రులు, పలువురు టీఆర్ఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. 1982లో తెలుగుదేశంలో పార్టీలో చేరిన మధుసూదనాచారి.. 1994-99 మధ్య కాలంలో శాయంపేట నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో…
ఏపీలో ఇటీవల ఎన్నికైన 11 మంది కొత్త ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం కార్యక్రమం మండలిలో జరుగుతోంది. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. మండలిలో బలం ఉందని ప్రతిపక్షం ఎలా వ్యవహారించిందో చూశామని, ఈ రోజు శుభదినమన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి జగన్ తప్పక న్యాయం చేస్తారనడానికి ఇదే నిదర్శనమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రతి ఎన్నికల్లో విజయం సాధిస్తున్నామని, నేతల మధ్య విభేదాలున్నా కలిసి కట్టుగా పని చేసి, ప్రజల…
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ లుగా ఎన్నికైన ఆరుగురు సభ్యులు ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి… ఒకరి తర్వాత ఒకరిని తన ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ పార్టీ కి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు గా గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీ హరి, బండా ప్రకాశ్, వెంకట్రామిరెడ్డి, తక్కళ్ల పల్లి…
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం లోపించిందా? ఎమ్మెల్యే కోటాతోపాటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై ఇదే చర్చ జరుగుతోందా? సామాజిక సమతుల్యత కోసం చివరి వరకు ప్రయత్నించినా ఎందుకు సాధ్యం కాలేదు? ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలపై చర్చ..! తెలంగాణలోని 9 జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ జరుగుతుండటంతో.. ఆ వేడి రాష్ట్రమంతా కనిపిస్తోంది. ఏకగ్రీవాలు అయినచోట ఒకలా.. పోటీ తప్పదనుకున్నచోట మరోలా చర్చలు వేడెక్కుతున్నాయి. ఎమ్మెల్యే…
టీఆర్ఎస్ ఆరు ఎమ్మెల్సీలు ఏకగ్రీవమైన సందర్భంగా కడియం శ్రీహరి మట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలపారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుంది తెలంగాణ అని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందన్నారు. అన్ని ప్రాం తాలు, అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు సీఎం కేసీఆర్ చిత్త శుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో చిత్తశుద్ధితో పనిచేస్తామని వెల్లడించారు.…