ఆమె యాక్షన్‌కి… ఈయన రియాక్షన్. అప్పుడైనా…ఇప్పుడైనా… ఆమెకి కౌంటర్ వేసేది ఆయనేనా..? పార్టీ ఇక ఫుల్ పవర్స్ ఇచ్చేసిందా? అట్నుంచి ఎప్పుడు పొలిటికల్ మిసైల్ వదిలినా…. మన పార్టీకి ఎస్ 400లా అడ్డుకోవాల్సింది నువ్వేనని అధిష్టానం చెప్పేసిందా? ఇంతకీ ఎవరా ఇద్దరు నేతలు? వాళ్ళ మధ్యనే పొలిటికల్ యుద్ధం ఎందుకు ఎక్కువగా జరుగుతోంది? తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ అంటే…. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇష్యూ నే. బీజేపీ…కాంగ్రెస్ అంటూ మాటల తూటాలు ఎక్కు పెడుతున్నారామె.…
తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థగా యూపీఎఫ్ నిలిచింది. యూపీఎఫ్ నూతన కార్యవర్గంఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. కన్వీనర్ గా బొల్లా శివశంకర్, అడ్వైజర్ గా గట్టు రామచందర్ రావును నియమించారు. అనంతరం తెలంగాణ జాగృతి కార్యాలయంలో యూపీఎఫ్ నాయకులతో కవిత సమావేశం నిర్వహించారు. త్వరలోనే బీసీ బిల్లులు సాకారం అయ్యేందుకు కార్యచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు.
ఇటీవల ఎమ్ఎల్సీ కవిత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాసిన లేఖ బహిర్గతం అయినప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో రాజకీయ వ్యవహారం హీటెక్కుతోంది. ఈ నేపథ్యంలో కవిత మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం ఓపెనింగ్ కు రెడీ అయ్యింది. ఇందిరా పార్క్ వద్ద పనిచేస్తున్న తెలంగాణ జాగృతి కార్యాలయం మూసివేయనున్నారు. Also Read:Chiranjeevi : చిరంజీవి, అనీల్ ప్రాజెక్ట్ షూటింగ్ అప్‌డేట్..! ఇవాళ సాయంత్రం 4.00…
ఎమ్మెల్సీ కవిత తాజాగా చిట్‌చాట్‌లో మాట్లాడింది. ఏది ఉన్నా తాను సూటిగానే మాట్లాడతానని స్పష్టం చేసింది. వెన్నుపోటు రాజకీయాలు చేయనని. తాను కేసీఆర్ లాగే నేను ఏదైనా సూటిగానే మాట్లాడతానన్నారు. తిక్క తిక్కగానే ఉంటానని తెలిపారు. "పార్టీని నడిపించే సత్తా మీకు లేదు.. నాకు నీతులు చెబుతున్నారా?. వరంగల్ మీటింగ్ సక్సెస్ అయ్యిందని చెప్పుకుంటున్న వాళ్లను చూసి జనం నవ్వుకుంటున్నారు. ఏమైనా ఉంటే.. పార్టీ ఫోరమ్ లోపల మాట్లాడాలి అన్నారు. నేను బయటే మాట్లాడతాను. తెలంగాణ ఏర్పడిన…
14 ఏళ్ల తర్వాత సినిమా అవార్డుల సంబరం.. గద్దర్ పేరుతో సినీ పురస్కారాలు..! తెలుగు చిత్రసీమలో మరోసారి సినీ అవార్డులతో వేదిక వెలుగులు నింపనుంది. 14 సంవత్సరాల విరామం తర్వాత ఉత్తమ తెలుగు సినిమాలకు రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలివ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ అవార్డులను ప్రముఖ ప్రజాకవి, గాయకుడు గద్దర్ గారి పేరుతో ఇవ్వాలని ప్రభుత్వం ఇదివరకే అధికారికంగా ప్రకటించింది. గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం ఒక మహత్తరమైన గౌరవంగా భావిస్తున్నారు తెలంగాణ సినీ ప్రేమికులు. ఈ…
MP Raghunandan Rao: మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత ఎపిసోడ్ ని ఫ్యామిలీ డ్రామాతో పోల్చారు. తెలంగాణలో దేవుళ్ళు ఉన్నారా దెయ్యాలు ఉన్నాయా అన్న విషయంపై చర్చ జరుగుతుంది.. దేవుడి పక్కన దెయ్యం ఉంటే 12 ఏళ్లుగా ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని వాళ్లే నాటకం ఆడుతున్నారు.
కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించింది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ కి నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని తెలిపింది.
ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. పార్టీలో అంతర్గత విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిదని సూచించారు. ఏ హోదాలో ఉన్నా బహిరంగంగా మాట్లాడటం కరెక్ట్ కాదని కేటీఆర్ అన్నారు. ఇది అందరికీ వర్తిస్తుందని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది. ఎవరైనా సూచనలు చేయొచ్చు.. లేఖ రాయొచ్చని తెలిపారు. అన్ని పార్టీల్లోను కోవర్టులుంటారు. మా పార్టీలో రేవంత్ రెడ్డి కోవర్టులుంటే ఉండొచ్చని కేటీఆర్ వెల్లడించారు. Also Read:Rahul Gandhi: కాశ్మీర్లో యుద్ధ…
MLC Kavitha: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు జారీ అయిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ఈ నోటీసులను ఖండిస్తూ ఆమె తన అధికారిక సోషల్ మీడియా ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. Read Also: IPL 2025 Final: ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లకు కొత్త వేదికలు ప్రకటించిన బీసీసీఐ..! ఈ సందర్బంగా ఆమె, ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ప్రజానాయకుడు కేసీఆర్ కి రాజకీయ…
MLC Kavitha : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి మాట్లాడే భాష, ఆయన ప్రస్తావించిన అంశాలు నీచంగా, బాధకరంగా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. కవిత వివరించగా, గతంలో కంచ గచ్చిబౌలిలో ప్రభుత్వ భూములను అమ్మి ఆదాయం పొందాలనే ప్రయత్నం ప్రభుత్వం చేసినప్పటికీ అది విఫలమైంది. భవిష్యత్తులో పరిశ్రమల అభివృద్ధి కోసం TG IIC ద్వారా మాజీ ముఖ్యమంత్రి…