నేడు బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్.. ఇక ఎర్ర సముద్రమే!
18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. మంగళవారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్‌లో 6 పరుగుల తేడాతో గెలిచిన ఆర్సీబీ.. ఐపీఎల్ 2025 టైటిల్‌ను కైవసం చేసుకుంది. మూడు సార్లు ఐపీఎల్ ఫైనల్లో భంగపడ్డ ఆర్సీబీ.. నాలుగో ప్రయత్నంలో ట్రోఫీని ఒడిసి పట్టింది. ఆర్సీబీ ఐపీఎల్ విజేతగా నిలవడంతో ఫాన్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి. విజయాలు, పరాజయాల్లో ఎన్నో ఏళ్లుగా జట్టునేతోనే ఉన్న అభిమానులతో కలిసి సంబరాలు చేసుకొనేందుకు ఆర్సీబీ ఫ్రాంఛైజీ బెంగళూరులో విక్టరీ పరేడ్ నిర్వహిస్తోంది.
అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజు…
ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా, ప్రజల తీర్పుపై సీఎం చంద్రబాబు నాయుడు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. నాటి ప్రజా తీర్పు ద్వారా రాష్ట్రంలో ఉన్మాద పాలనను తుది గా అడ్డుకున్నామని ఆయన పేర్కొన్నారు. వచ్చే నాలుగేళ్లలో కూటమి ప్రభుత్వంలో మరింత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజలకు, కూటమి పార్టీల కార్యకర్తలు, నేతలకు ఆయన అభినందనలు తెలియజేశారు. “జూన్ 4…. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో మైలురాయి కావడమైన ఈ రోజు ప్రజా విప్లవం ఘటించిన రోజు. అధికారం పేరుతో ప్రజలపై అవినీతి, ఉన్మాద పాలన చేసిన వారిని ప్రజలు తిప్పికొట్టారు. సైకో పాలనకు ఇదే అంత్యమయ్యింది. ప్రతి పౌరుడు స్వేచ్ఛను పొందిన రోజు ఇది. ప్రజల ఓటుల ద్వారా తిరిగి రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి పునాది పడింది. ప్రభుత్వ ఉగ్రవాదానికి తలదూర్చి కూటమి పాలన సంక్షేమం, అభివృద్ధి వేదికగా నిలిచింది. పసుపు సైనికుల పోరాటాలు, జనసైనికుల ఉద్యమాలు, కమలనాథుల మద్దతుతో రాష్ట్రం ఈ విజయాన్ని సాధించింది,” అని చంద్రబాబు అన్నారు.
జ్యోతి మల్హోత్రాతో సంబంధం ఉన్న మరో యూట్యూబర్ అరెస్ట్
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ హర్యానకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. 9 రోజుల పాటు విచారించి.. అనేక విషయాలు రాబట్టారు. అనంతరం పలువురు యూట్యూబర్లను నిఘా వర్గాలు అరెస్ట్ చేశాయి. తాజాగా జ్యోతి మల్హోత్రాతో సంబంధాలు ఉన్న జస్బీర్ సింగ్‌ను బుధవారం నిఘా వర్గాలు అరెస్ట్ చేశాయి. జస్బీర్ సింగ్ ‘జాన్ మహల్’ అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. ఇతనికి 1.1 మిలియన్లకు పైగా సబ్‌స్కైబర్లు ఉన్నారు. జ్యోతి మల్హోత్రాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పాకిస్థాన్ మద్దతుతో ఇతడు గూఢచర్యం చేసినట్లుగా పంజాబ్ పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ ఐఎస్ఐ కార్యకర్త షకీర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. జస్బీర్ సింగ్.. పాకిస్థాన్ జాతీయ దినోత్సవ కార్యక్రమానికి కూడా హాజరయ్యాడు. ఇప్పటికే పాకిస్థాన్‌కు మూడు సార్లు వెళ్లి వచ్చినట్లుగా ఆధారాలు సేకరించారు. పాకిస్థాన్ అధికారి డానిష్‌తో కూడా సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు.
విధ్వంసపాలనపై ప్రజలు గెలిచారు.. ఐదు కోట్ల ప్రజలకు కృతజ్ఞతలు!
2024 అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి.. కూటమి ప్రభుత్వం పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ప్రజాస్వామ్యం గెలిచిన రోజు అని పేర్కొన్నారు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున విధ్వంసపాలనపై ప్రజలు గెలిచారన్నారు. అరాచక, కక్షపూరిత పాలనపై ప్రజా ఆకాంక్షలు ఘన విజయం సాధించాయని.. ఈ గెలుపు ఐదు కోట్ల ప్రజల గెలుపు అని అన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని మంత్రి లోకేశ్ చెప్పుకొచ్చారు. ‘ప్రజాస్వామ్యం గెలిచిన రోజు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున విధ్వంసపాలనపై ప్రజలు గెలిచారు. అరాచక, కక్షపూరిత పాలనపై ప్రజా ఆకాంక్షలు ఘన విజయం సాధించాయి. ఈ గెలుపు ఐదు కోట్ల ప్రజల గెలుపు. ప్రజా తీర్పు మా కూటమి బాధ్యతను మరింత పెంచింది. చంద్రబాబు గారి పాలనానుభవం, పవనన్న ఆశయానికి మోదీ గారి ఆశీస్సులు పుష్కలంగా లభించడంతో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం ప్రారంభమైంది. ప్రజా ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన ఐదు కోట్ల ప్రజలకు కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ఇదే స్ఫూర్తితో మాకు అండగా నిలుస్తారని కోరుతున్నాను. ప్రజా తీర్పుదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు’ అని మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
కవిత లేఖపై కొండా సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్ ఫ్యామిలీనే తెర వెనుక కుట్రదారులు..!
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన లేఖ రాజకీయ డ్రామా మాత్రమేనని, దీని వెనుక అసలు స్కెచ్‌ను మాజీ సీఎం కేసీఆరే తయారుచేశారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన… ఈ డ్రామా ద్వారా కవిత మీడియా దృష్టిని ఆకర్షించగలిగిందని, హెడ్లైన్లలో నిలవడమే లక్ష్యంగా ఇది సాగించబడిందని వ్యాఖ్యానించారు. “కవిత తన ఉద్దేశాన్ని సాధించగలిగింది. బీఆర్ఎస్ ప్రజాదరణ కోల్పోతుండటంతో దృష్టి మళ్లించేందుకు ఇది వ్యూహాత్మకంగా తయారుచేసిన స్క్రిప్టు. ఇది పూర్తిగా ట్రాష్ డ్రామా. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచే ఈ స్కెచ్‌లన్నీ జరుగుతున్నాయి,” అని కొండా తీవ్రంగా విమర్శించారు.
ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌లో 9 విమానాలు ధ్వంసం! ఆధారాలివే!
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న భారత్.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో 100 మంది ఉగ్రవాదులు హతం కాగా.. పాకిస్థాన్ వైమానిక స్థావరాలు నాశనం అయ్యాయి. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన 9 విమానాలు ధ్వంసం అయినట్లుగా సమాచారం అందుతోంది. వైమానిక స్థావరాలతో పాటు సైనిక ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లినట్లు వర్గాలు పేర్కొంటున్నాయి. పాకిస్థాన్ వైమానికి దళానికి చెందిన ఆరు యుద్ధ విమానాలు, రెండు ఖరీదైన నిఘా విమానాలు, పదికి పైగా సాయుధ డ్రోన్లు, ఒక సీ -130 పెర్క్యులస్ రవాణా విమానం ధ్వంసం అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మాజీ మంత్రి బొత్స సత్య నారాయణకు అస్వస్థత!
వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. వైసీపీ నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఒక్కసారిగా కుప్పకూలారు. బొత్స అస్వస్థతకు గురవడంతో వైసీపీ నేతలు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. బీపీ తగ్గడంతో ఆయన ఇబ్బంది పడ్డారు. గరివిడి నుంచి విజయగరంకు బొత్స బయల్దేరారు. వైసీపీ ఆధ్వర్యంలో ‘వెన్నుపోటు దినం’ నిరసన ర్యాలీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. చీపురుపల్లిలోని ఆంజనేయపురం నుంచి స్థానిక మూడురోడ్ల కూడలి వరకు నిర్వహించిన ర్యాలీలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. మైకులో మాట్లాడుతుండగానే ఆయన ఒక్కరిగా సొమ్మసిల్లి పడిపోయారు. పార్టీ నేతలు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఎండ, వేడి ఎక్కువగా ఉండటంతో బొత్స వడదెబ్బకు గురైనట్లు తెలుస్తోంది.
కాళేశ్వరం కమిషన్ కాదు.. అది కాంగ్రెస్ కమిషన్, రాజకీయ కమిషన్
హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ప్రాంగణం మంగళవారం ఉదయం ఉద్రిక్త వాతావరణాన్ని చూసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జారీ చేసిన నోటీసులకు వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన ఈ ధర్నాకు భారీ సంఖ్యలో జాగృతి కార్యకర్తలు తరలివచ్చారు. కవిత తన వ్యాఖ్యలతో ఈ వ్యవహారాన్ని పూర్తిగా రాజకీయ కుట్రగా అభివర్ణించారు. “కేసీఆర్ గారికి నోటీసులు జారీ చేసిన తీరు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నది. ఆయన చేసిన అభివృద్ధి పనులన్నీ ఇప్పుడు కుట్రలుగా మలచాలని చూస్తున్నారు. తెలంగాణ భూములకు నీళ్లు ఇచ్చిన నాయకుడికి ఈ విధంగా నోటీసులు ఇవ్వడం అన్యాయం,” అంటూ తీవ్రంగా మండిపడ్డారు.
నేడు ఇందిరాపార్క్ దగ్గర తెలంగాణ జాగృతి ధర్నా
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్ నోటీసులు ఇచ్చినందుకు నిరసనగా తెలంగాణ జాగృతి భారీ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈరోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ మహాధర్నా ఇందిరా పార్క్ వద్ద జరగనుంది. ఈ ధర్నాను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వయంగా నేతృత్వం వహించనున్నారు. కేంద్ర సంస్థలు కేసీఆర్‌పై టార్గెట్ చేసినట్లు ఆరోపిస్తూ, ఇది రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ జాగృతి నిరసన కార్యక్రమాన్ని చేపట్టనుంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు సంబంధించి విజిలెన్స్, NDSA నివేదికల అనంతరం కేసీఆర్‌కు నోటీసులు రావడం, దానిపై తెలంగాణ భవనుల నుండి కార్యకర్తల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ మహాధర్నా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ మాజీ సీఎం ప్రతిష్టను దెబ్బతీయాలని జరుగుతున్న చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జాగృతి ఈ నిరసన చేపడుతోందని కవిత పేర్కొన్నారు. ఈ మహాధర్నాలో జాగృతి కార్యకర్తలు, తెలంగాణ సంస్కృతి సంఘాల ప్రతినిధులు, నాయకులు భారీగా పాల్గొనే అవకాశం ఉంది. అధికార సంస్థల నిర్ణయాలను ప్రశ్నించే స్థాయిలో ఇది కీలక కార్యక్రమంగా మారనుంది.
ఐపీఎల్ విజేత ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా.. అవార్డ్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ విజేతగా నిలిచింది. మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ.. ఐపీఎల్ 2025 టైటిల్‌ను కైవసం చేసుకుంది. మూడు సార్లు ఫైనల్లో భంగపడ్డ బెంగళూరు.. నాలుగో ప్రయత్నంలో ట్రోఫీని ఒడిసి పట్టింది. ఆర్సీబీ ఐపీఎల్ విజేతగా నిలవడంతో అటు ప్లేయర్స్, ఇటు ఫాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఇక ఐపీఎల్ 2025 విజేతగా నిలిచిన ఆర్సీబీకి రూ.20 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది.